హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: ఆ మహిళలు చెప్పింది విని ఆశ్చర్యపోయిన అక్షయ్ కుమార్

Mission Paani: ఆ మహిళలు చెప్పింది విని ఆశ్చర్యపోయిన అక్షయ్ కుమార్

దేశంలో విపరీతంగా నీటి కొరత సమస్య

దేశంలో విపరీతంగా నీటి కొరత సమస్య

Mission Paani: నీటిని కాపాడేందుకు, తాగునీటిని పొదుపు చేసేందుకు ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అదే మిషన్ పానీ. అందులో భాగంగా జరిగిన మిషన్ పానీ మారథాన్‌లో ప్రముఖులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.

Mission Paani: మన దేశంలోని మెట్రోలు, ఇతర నగరాలన్నింటిలోనూ నీటి కొరత ఉందని మీకు తెలుసా. అలా కొరత ఉండబట్టే... హైదరాబాద్ లాంటి కొన్ని నగరాల్లో మంచి నీటిని రోజూ ఇవ్వకుండా... రెండు రోజులకు ఓసారి సరఫరా చేస్తుంటే... మరికొన్ని చోట్ల... మూడు లేదా 4 రోజులకు ఓసారి మాత్రమే నీరు సప్లై చేస్తున్నారు. ఆ నీటినే తాగాలి, ఆ నీటితోనే అన్ని పనులూ చేసుకోవాలి. ఆ నీరే లేకపోతే... పూట గడవదు. దాహం వెయ్యగానే గుక్కెడు నీరు తాగేవారు ఈ దేశంలో అదృష్టవంతులు అని అనుకోవచ్చు. ఎందుకంటే... ఆ గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఈ ఇద్దరు మహిళల్నే తీసుకుంటే... వీరు ఉండేది ముంబైకి... శివార్లలోనే. కానీ వీరికి విపరీతమైన నీటి కొరత ఉంది. నీటి కోసం వీళ్లు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ఓ పూటంతా నీటి కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని వీరు నీటి పొదుపుపై ఉద్యమం చేస్తున్న అక్షయ్ కుమార్‌కి వివరించారు. తమ లాగా ఇంకా ఎంతో మంది నీటి కోసం పడిగాపులు పడుతున్నామని చెబుతూ ఆవేదన చెందారు. ముంబైకి పక్కనే ఇలా ఉంటే... మరి పల్లెల్లో, ఎడారి ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ మారథాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్టుగా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్‌కీ జుబానీ" థీమ్‌తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.

నీటి పొదుపుతోపాటూ... ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాల్సిన అంశంపైనా ఈ ఉద్యమంలో పోరాటం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. లెఫ్టినెట్ కల్నల్ ఎస్జీ దాల్వీ వంటి ఎంతో మంది పరిశుభ్రతపై ప్రచారం కల్పిస్తుంటే... అమలా రుయా వంటివారు... నీటి కొరతపై పోరాడుతున్నారు. ఇలా ఎంతో మంది నీటిని పొదుపు చేయడం ఎలా, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా, నీటి లభ్యత పెంచేందుకు ఏం చెయ్యాలి, పరిశుభ్రతను ఎలా పెంచాలి, మురికి వాడల్లో ప్రజలకు మేలైన జీవితాన్ని ఎలా అందించాలి... వంటి అంశాలపై ఈ ఉద్యమం ద్వారా మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్నారు.

First published:

Tags: Mission paani

ఉత్తమ కథలు