• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MISSION PAANI WATERTHON SOHA ALI KHAN CALLS TO PROTECT WATER AND BE PART OF MISSION PAANI MARATHON HISTORIC OCCASION NK

Mission Paani: మిషన్ పానీ చరిత్రాత్మకం... నేను సైతం అంటున్న సోహా అలీ ఖాన్

Mission Paani: మిషన్ పానీ చరిత్రాత్మకం... నేను సైతం అంటున్న సోహా అలీ ఖాన్

సోహా అలీ ఖాన్ (image credit - instagram)

Mission Paani: నీటిని కాపాడేందుకు, తాగునీటిని పొదుపు చేసేందుకు ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అదే మిషన్ పానీ. అందులో భాగంగా జరిగిన మిషన్ పానీ మారథాన్‌లో ప్రముఖులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.

  • Share this:
    Mission Paani: మంచి నీటి కోసం ఓ మీటింగ్ పెట్టుకొని... దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు అందులో పాల్గొని... నీటిని పొదుపు చేస్తాం అని ఓ ప్రతిజ్ఞ చేసే కరవు పరిస్థితులు మన దేశంలో రావడం మన దురదృష్టం. ఎందుకంటే... మన దేశంలో నిండా జీవ నదులు ఉంటాయి. బోలెడంత నీరు. కానీ ఆ నీటిని మనమే కాలుష్య భరితం చేశాం. ఫ్యాక్టరీలు, మానవులు పారేస్తున్న వ్యర్థాల వల్ల వస్తున్న కాలుష్యమంతా నదులు, సముద్రాల్లోనే చేరుతోంది. ఏళ్లు గడిచేకొద్దీ ఈ కాలుష్యం పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు మనం వాడుతున్న నీరంతా ఆల్రెడీ 15 సార్లు ఫిల్డర్ చేసినదే అంటే నమ్మగలరా. అవే నీటిని మళ్లీ మళ్లీ తాగుతూ... నీటి కొరతతో జీవిస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచైనా మనం నీటిని కాపాడుకోవాలి. అవసరమైనంతే వాడుకోవాలి. ఉత్తినే పంపులు ఆన్ చేసి వదిలేయకూడదు. ట్యాంక్ నిండగానే మోటర్ ఆపేసుకోవాలి. అప్పుడే నీరు ఆదా అవుతుంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ చెబుతోంది. నీటిని కాపాడుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేవి ప్రతి భారతీయుడి బాధ్యత అంది ఆమె. మిషన్ పానీ మారథాన్‌లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొని... నీటిని పొదుపుచేస్తామని హామీ ఇవ్వడం తనకెంతో ప్రేరణ కలిగిస్తోందని ఆమె తెలిపింది. ఓ గొప్ప లక్ష్యం కోసం ఈ చరిత్రాత్మక మారథాన్ జరుగుతోందనీ... ఇందులో అంతా పాల్గొనాలనీ ఆమె ట్విట్టర్ ద్వారా కోరింది.



    దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ మారథాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్టుగా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్‌కీ జుబానీ" థీమ్‌తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.


    నీటి పొదుపుతోపాటూ... ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాల్సిన అంశంపైనా ఈ ఉద్యమంలో పోరాటం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. లెఫ్టినెట్ కల్నల్ ఎస్జీ దాల్వీ వంటి ఎంతో మంది పరిశుభ్రతపై ప్రచారం కల్పిస్తుంటే... అమలా రుయా వంటివారు... నీటి కొరతపై పోరాడుతున్నారు. ఇలా ఎంతో మంది నీటిని పొదుపు చేయడం ఎలా, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా, నీటి లభ్యత పెంచేందుకు ఏం చెయ్యాలి, పరిశుభ్రతను ఎలా పెంచాలి, మురికి వాడల్లో ప్రజలకు మేలైన జీవితాన్ని ఎలా అందించాలి... వంటి అంశాలపై ఈ ఉద్యమం ద్వారా మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు