MISSION PAANI WATERTHON ACT FAST TO COUNTER INDIAS WATER CRISIS SAYS CHESS GRANDMASTER VISWANATHAN ANAND SRD
Mission Paani: నీటి సంక్షోభాన్ని దేశం నుంచి వేగంగా తరిమికొడదాం..పిలుపునిచ్చిన విశ్వనాథన్ ఆనంద్
Viswanathan Anand
Mission Paani: విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెస్ లో భారత ప్రతిష్టలు ప్రపంచ నలుమూలల వ్యాపించిన ఆటగాడు. ఈ దిగ్గజ ప్లేయర్ మిషన్ పానీ కార్యక్రమంలో భాగమయ్యారు.
Last Updated:
Share this:
విశ్వనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెస్ లో భారత ప్రతిష్టలు ప్రపంచ నలుమూలల వ్యాపించిన ఆటగాడు. ఈ దిగ్గజ ప్లేయర్ మిషన్ పానీ కార్యక్రమంలో భాగమయ్యారు.మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికం అవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృథా అని చెప్పక తప్పదు. నీరు ఉన్న వారు ఇష్టారీతిగా వృథా చేస్తుంటే లేని వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిగా వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో మనం చాలా నీటిని సేవ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. నెట్ వర్క్ 18, హార్పిక్ సంయుక్తంగా ప్రారంభించిన మిషన్ పానీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరయ్యారు. నీటి వనరుల లభ్యత, నీటి సంరక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఇక నీటి సంక్షోభంపై స్పందించారు విశ్వనాథన్ ఆనంద్.
" కొన్నేళ్ల క్రితం చెన్నై భారీ వరదలతో అల్లాడింది. అలాగే కరువుతో తల్లడిల్లింది. మన పర్యావరణం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడ ముప్పులో ఉంది. మానవుల చేసే తప్పుల వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారనుంది. ఇలాంటి పరిస్థితులు రాక ముందే మనం మేల్కోవాలి. నీటి సంక్షోభాన్ని తరిమికొట్టాడానికి వేగంగా చర్యలు తీసుకోవాలి" అని పిలుపునిచ్చారు ఆనంద్.
దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ మారథాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్టుగా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్‌కీ జుబానీ" థీమ్‌తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.