హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం కోసం ప్రతిజ్ఞ.. భారత్‌లో తొలిసారి ఆవిష్కరించిన మిషన్ పానీ ప్రోగ్రాం

Mission Paani: స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం కోసం ప్రతిజ్ఞ.. భారత్‌లో తొలిసారి ఆవిష్కరించిన మిషన్ పానీ ప్రోగ్రాం

Mission Paani

Mission Paani

న్యూస్ 18-హార్పిక్ ఇండియా క్యాంపెయిన్ అయిన ‘మిషన్ పానీ’.. సమ్మిళిత పారిశుద్ధ్యం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతిజ్ఞకు రూపకల్పన చేసి మార్గదర్శకంగా నిలిచింది.

నీటి వనరుల సంరక్షణతో పాటు పారిశుధ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి నెట్‌వర్క్-18 సంస్థ నడుం భిగించింది. హార్పిక్ ఇండియాతో కలిసి నెట్‌వర్క్-18 మిషన్ పానీ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. నేడు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్రముఖులు, క్రీడాకారులు, కార్యకర్తలతో కలిసి పారిశుద్ధ్యం, పరిశుభ్రత చర్యలపై దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా సురక్షితమైన నీరు, స్థిరమైన పారిశుధ్యం కోసం మొదటిసారి పీఠికను నెట్‌వర్క్ 18 పరిచయం చేసింది. ఆరోగ్యకరమైన దేశానికి స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన పారిశుద్ధ్యం అత్యవసరం. ఇది భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన మానవ హక్కుల అంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో న్యూస్ 18-హార్పిక్ ఇండియా క్యాంపెయిన్ అయిన ‘మిషన్ పానీ’.. సమ్మిళిత పారిశుద్ధ్యం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతిజ్ఞకు రూపకల్పన చేసి మార్గదర్శకంగా నిలిచింది.

మిషన్ పానీ కార్యక్రమం కమ్యూనిటీలు, కార్పొరేట్లు, NGOలు, సెలబ్రిటీలతో సహా అన్ని రంగాలలోని నిపుణులు, కార్యకర్తలను ఒకచోట చేర్చి.. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం అన్ని ప్రయత్నాలను విస్తృతం చేస్తుంది.

* కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు?

నేడు నిర్వహించిన మిషన్ పానీ- వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమంలో ప్రముఖ గీత రచయిత కౌసర్ మునీర్, హాకీ ప్లేయర్ సవితా పునియా, క్రికెటర్ స్మృతి మంధాన, భారత హాకీ టీమ్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, పారా అథ్లెట్- టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినా పటేల్, బాక్సర్ లోవ్లినా బోరోగైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన పారిశుధ్యం కల్పిస్తామని వీరు ప్రతిజ్ఞ చేశారు. వరల్డ్ టాయిలెట్ డే- 2021 నాడు చేపట్టిన ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం.. దేశంలో అత్యుత్తమ పారిశుద్ధ్య పద్ధతులను ప్రోత్సహించడంతోపాటు నీటి నిర్వహణ, సంరక్షణకు సంబంధించి అవగాహన కల్పించనుంది.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ప్రఖ్యాత నటుడు అక్షయ్ కుమార్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. పారిశుద్ధ్య రంగానికి చెందిన ప్రముఖులు, పర్యావరణ యోధులు, ప్రభుత్వ పెద్దలతో పాటు పరిశ్రమ నిపుణులు సైతం ఈవెంట్‌లో పాల్గొన్నారు. భారతదేశంలోని అందరికీ సుస్థిరమైన పారిశుధ్యం, స్వచ్ఛమైన నీటిని అందించడానికి మిషన్ పానీ రూపొందించిన పీఠిక, ప్రతిజ్ఞలను అతిథులు చదివి వినిపించారు.

* మిషన్ పానీ ప్రతిజ్ఞ ఎవరి చొరవ?

మిషన్ పానీ ప్రతిజ్ఞను ప్రముఖ గేయ రచయిత కౌసర్ మునీర్ రచించారు. 'అందరికీ పారిశుధ్యం: సురక్షిత మరుగుదొడ్లు, సురక్షితమైన నీరు, సురక్షిత దేశం' (Sanitation for All Pledge: Safe Toilets, Safe Water, Safe Nation) పేరుతో దీన్ని పరిచయం చేశారు. వరల్డ్ టాయిలెట్‌ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు ఈ ప్రతిజ్ఞ చేశారు.

* పారిశుద్ధ్య ప్రతిజ్ఞ

‘భారతదేశ ప్రజలమైన మేము.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, స్థిరమైన పారిశుద్ధ్య అలవాట్లను కలిగి ఉంటాం. మన పౌరులందరికీ శుభ్రమైన మరుగుదొడ్లు, నీరు అందుబాటులోకి రావడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.’

* సస్టైనబుల్ శానిటేషన్- పీఠిక

‘భారతదేశ ప్రజలమైన మేము.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం కలిసి నిలబడతాం. మన సమాజాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించడానికి, స్థిరమైన పారిశుద్ధ్యం కోసం పోరాడటానికి, సురక్షితమైన మరుగుదొడ్లతో పాటు నీటి వసతులు పొందే హక్కును కల్పించడానికి పాటుపడతామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ విజయవంతం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. నీటి వినియోగంపై ఒకరికొకరు అవగాహన కల్పించుకోవడానికి, సుస్థిరమైన, సురక్షితమైన పారిశుద్ధ్య సదుపాయాల కల్పన కోసం ప్రజా ఉద్యమాన్ని రూపొందిస్తాం. కోట్లాదిమంది భారతీయుల గౌరవం కోసం పాటుపడేందుకు కృషి చేస్తాం. కోవిడ్ నేపథ్యంలో భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం.’

ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం.. వివిధ రాష్ట్రాలు, సంస్థలు, NGOలు, సంఘాలు, ప్రముఖుల గొంతులను ఏకం చేసింది. ప్రతి భారతీయునికి సురక్షితమైన నీరు, పారిశుద్ధ్య భద్రత కల్పించేందుకు మిషన్ పానీ కార్యక్రమం ప్రతిజ్ఞతో పాటు పీఠికకు రూపకల్పన చేసి అన్ని వర్గాలను ఈ క్రతువులో భాగస్వామ్యం చేస్తోంది. సురక్షితమైన, ఆరోగ్యకరమైన భారతదేశం కోసం అన్ని వయసుల వ్యక్తులు, ప్రముఖులను మిషన్ పానీ భాగస్వామ్యులుగా చేస్తోంది. పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పెంపొందించేందుకు మిషన్ పానీ కార్యక్రమం ముందు నుంచి కృషి చేస్తోంది. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో భాగమై మిషన్ పానీ ఇనిషియేటివ్‌లో చేరవచ్చు. ఇందుకు మిషన్ పానీ వెబ్‌సైట్‌లో (https://www.news18.com/mission-paani/) లాగిన్ అయితే చాలు.

First published:

Tags: Mission paani, News18, Water, Water conservation

ఉత్తమ కథలు