Mission Paani: శుభ్రమైన తాగునీరు, భూగర్భజలం.. ఇదే మన లక్ష్యాలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

హర్షవర్ధన్, అక్షయ్ కుమార్

నీటి సంరక్షణలో తాగునీరు, భూ గర్భ జలం రెండు పిల్లర్ల లాంటివని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. నెట్ వర్క్ 18, హార్పిక్ సంయుక్తంగా ప్రారంభించిన మిషన్ పానీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Share this:
    నీటి సంరక్షణలో తాగునీరు, భూ గర్భ జలం రెండు పిల్లర్ల లాంటివని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. నెట్ వర్క్ 18, హార్పిక్ సంయుక్తంగా ప్రారంభించిన మిషన్ పానీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ మహోత్తర కార్యక్రమానికి హాజరయ్యారు. నీటి వనరుల లభ్యత, నీటి సంరక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మిషన్ పానీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రసంగిస్తూ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎక్కడి నీరు అక్కడే వినియోగించుకోవాలనే ఐడియాతో ముందుకొచ్చారు. గ్రామాల్లో నీరు గ్రామాల్లోనే. పట్టణాల్లో నీరు పట్టణాల్లోనే. పొలాల్లో నీరు పొలాల్లోనే అనే విధానాన్ని తీసుకొచ్చారు.’ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. దీని ద్వారా అందరికీ నీరు చేరుతుందన్నారు. నీటి పంపిణీ సులభం అవుతుందన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి వాటర్ మారథాన్ నిర్వహించారు. నీటి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. 72వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

    మిషన్ పానీ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘భూగర్భ జలాలను సంరక్షించడం మన బాధ్యత. అలాగే, పరిశుభ్రమైన తాగునీరు అందించడం కూడా మన బాధ్యత.’అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాటర్ టెక్నాలజీ గురించి తెలియజేశారు. టెక్నాలజీ సాయంతో అందరికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

    మిషన్ పానీ కార్యక్రమం ప్రారంభోత్సవం మిషన్ పానీ గీతంతో ప్రారంభమైంది. ఈషా డియోల్, మల్లికా సారాభాయ్ క్లాసికల్ డ్యాన్స్‌తో కొనసాగింది. నటుడు అక్షయ్ కుమార్ (మిషన్ పానీ బ్రాండ్ అంబాసిడర్) కూడా నీటిని సంరక్షిస్తామని జల ప్రతిజ్ఞ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: