హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: ట్రాన్స్‌‌జెండర్లే స్వయంగా నడుపుతున్న వాటర్ ప్లాంట్.. ఎక్కడుందో తెలుసా..

Mission Paani: ట్రాన్స్‌‌జెండర్లే స్వయంగా నడుపుతున్న వాటర్ ప్లాంట్.. ఎక్కడుందో తెలుసా..

;ప్రతీకాత్మక చిత్రం

;ప్రతీకాత్మక చిత్రం

మిషన్ పానీ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర(Maharashtra)లోని వాఘోలి (Wagholi) సమీపంలో ఒక వాటర్ ప్లాంట్ (Water Plant) ప్రారంభించబడింది. అయితే, దీన్ని పూణేకి చెందిన ట్రాన్స్ జండర్స్ నడుపుతూ ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

ఇంకా చదవండి ...

నీటి కొరత వల్ల మానవాళికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. సహజసిద్దంగా లభించే నీటిని పొదుపుగా వాడుకోకపోతే భవిష్యత్లో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి వనరులు తగ్గిపోతే జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారత ప్రభుత్వం మిషన్ పానీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములవుతున్నారు. తాజాగా మిషన్ పానీ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర(Maharashtra)లోని వాఘోలి (Wagholi) సమీపంలో ఒక వాటర్ ప్లాంట్ (Water Plant) ప్రారంభించబడింది. అయితే, దీన్ని పూణేకి చెందిన ట్రాన్స్ జండర్స్ నడుపుతూ ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ట్రాన్స్జండర్స్(Transgender)కు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు, వారిని సరైన మార్గంలో నడపడటానికి కైనర్ సర్వీసెస్ (Kineer Services) అనే స్వచ్ఛంద సంస్థ ఈ తాగునీటి ప్లాంట్ ను ప్రారంభించింది.

దీన్ని పూణే-అహ్మద్‌నగర్(Pune -Ahmednagar) రహదారి వెంబడి ఏర్పాటు చేశారు. కైనర్ సర్వీసెస్ సంస్థను ప్రముఖ ట్రాన్స్జండర్ కార్యకర్త లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి (Laxmi Narayan Tripathi) నడుపుతున్నారు. ఈ ప్లాంటును నడపడానికి మమతా(Mamta), రాణితై పటేల్(Ranitai Patel), శక్తి(Shakti), ప్రేర్నా (Prerna) అనే నలుగురు ట్రాన్స్జెండర్లను నియమించారు. ట్రాన్స్జెండర్లను నియమించడంపై ఆయన మాట్లాడుతూ “మన సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. వారు కూడా అందరిలా గౌరవంగా బతకడానికి ఉద్యోగం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్లాంట్ ను నెలకొల్పి, నలుగురు ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించాం.

మమతా అనే 33 ఏళ్ల ట్రాన్స్జెండర్ ను ఈ ఉద్యోగంలోకి తీసుకోవడంతో ఆమె జీవితమే మారిపోయింది. గత ఆగస్టు వరకు, ఆమె ఇతర ట్రాన్స్‌జెండర్లతో కలిసి దుకాణాల వద్ద యాచిస్తూ ఉండేది. వివాహ కార్యక్రమాలలో నృత్యం చేయడం ద్వారా డబ్బు సంపాదించేది. ఈ క్రమంలో ఆమె ఎన్నో 'అవమానాలకు' గురైంది. ప్రస్తుతం, ఈ ఉద్యోగం ద్వారా ఆమె గౌరవంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటుంది. ఆమె ప్లాంట్‌లో చేరిన తరువాత, సెక్యూరిటీ గార్డుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరూ గౌరవం ఇస్తున్నారు.’’ అని అన్నారు

ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష తగ్గించడమే లక్ష్యం..

ప్లాంట్ ను నడుపుతున్న మరో ట్రాన్స్జెండర్ 37 ఏళ్ల రాణితై కామర్స్ గ్రాడ్యుయేట్(Commerce Graduate). ఆమె కొంత కాలం మార్కెటింగ్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత ఉద్యోగం కోల్పోయింది. దీంతో, 88 ఏళ్ల వయసున్న ఆమె తల్లి బాధ్యత భారంగా మారింది. కైనర్ సర్వీసెస్లో ఉద్యోగం కోసం ఆమెను సంప్రదించి ఉద్యోగం కల్పించారు. దీంతో తాను గౌరవంగా జీవిస్తూ, తన తల్లి సంరక్షణ చూసుకుంటుంది. దీనిపై కైనర్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మనీష్ జైన్(Manish Jain) మాట్లాడుతూ.. ‘‘ఈ ప్లాంట్ పూర్తిగా ట్రాన్స్‌జెండర్లచే నడుపబడుతోంది. వారంతా ఈ ప్లాంట్ ద్వారా ఉపాధి పొందుతూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. ట్రాన్స్జెండర్ ని ఈ ఉద్యోగాల్లోకి తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఆనందంగా ఉంది.’’ అని అన్నారు.

ట్రాన్స్జెండర్స్ కు మరిన్ని అవకాశాలు కల్పించి, సమాజంలో లింగ వివక్ష పట్ల అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్లాంట్ ను మరింత విస్తరించి మరికొంత మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్లాంట్ ప్రతిరోజూ 200 డబ్బాల నీటిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ద్వారా పూణే -అహ్మద్ నగర్ (Pune -Ahmednagar)రోడ్ లో గల మల్టీనేషనల్ కంపెనీలకు నీటి సరఫరా చేయబడుతుంది.

First published:

Tags: Maharashtra, Mission paani, Transgender, Water