Mission Paani: సమాజమా మేలుకో.. నీటిని కాపాడుకో: జస్టిస్ పసాయత్

ప్రతీకాత్మక చిత్రం

Mission Paani: విపత్కర నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి సమాజమంతా ఒక్కటిగా నిలవాలని, లేకపోతే మనకు మనమే వినాశనానికి ఆహ్వానం పలుకుతున్నట్లే అవుతుందని జస్టిస్ అరిజిత్ పసాయత్ పేర్కొన్నారు.

  • Share this:
విపత్కర నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి సమాజమంతా ఒక్కటిగా నిలవాలని, లేకపోతే మనకు మనమే వినాశనానికి ఆహ్వానం పలుకుతున్నట్లే అవుతుందని జస్టిస్ అరిజిత్ పసాయత్ పేర్కొన్నారు. ప్రపంచంలో 200 కోట్లమంది ప్రజలు వేరే దారిలేక బలవంతంగా కలుషితమైన నీటిని తాగుతున్నారని, కలుషితమైన నీటి ద్వారా వచ్చే రోగాల బారిన పడే ప్రమాదం వారందరికీ ఉందని ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియబరుస్తోందని వ్యాఖ్యానించారు. శుద్ధమైన నీరు అందుబాటులో ఉండడం అందరి హక్కు అని, రాజ్యాంగంలోని 21 అధికరణం ప్రజలకు ఆ హక్కును కలిగించిందని ఆయన తెలిపారు. ఇక, పర్యావరణానికి మరింత ముప్పు రాకుండా ఎలా చూడాలన్న విషయాన్ని ఇప్పుడైనా మనం ఆలోచించాలని, ఈ విషయంలో సద్గురు ముందు చూపు గురించి మనం తెలుసుకోవాలన్నారు. ‘రాలీ ఫర్ రివర్స్’ ఉద్యమాన్ని ప్రారంభించిన సద్గురు వివేకాన్ని ప్రశంసించాలని ఆయన అన్నారు.

‘నీటిని ఎలా నిల్వ చేసుకోవాలి, నీటి వనరులను ఎలా సంరక్షించుకోవాలి అనే సమస్యను మనం పరిష్కరించుకోలేపోతే విపత్తు ఎదుర్కొనే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ పెను సమస్యను సమాజం అంతా కలసి ఎదుర్కోవాలి. ఇలాంటి ఉద్యమాల్లో సమాజం అంతా కలసి ఎలా పాలుపంచుకోవాలి అన్నదానికి ‘కావేరీ కాలింగ్’ ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే, ఈ ఉద్యమం వనరులను సంరక్షించడమే కాక, నదుల చుట్టూ, నదుల జన్మస్థలాల దగ్గర నివసించే ప్రజలకు ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా లాభదాయకంగా ఉండే నమూనా పరిష్కారాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. భూమిలో నీటిని నిలుపుకోవాలంటే మొక్కలను నాటడమే పరిష్కారం అని ప్రపంచమంతా ఒక అంగీకారానికి వచ్చింది’ అని పసాయత్ వెల్లడించారు.

Mission Paani,Madaram village,Jalsakthi,water harvesting,మిషన్ పానీ,మాదారం గ్రామం,మాదారంలో ఇంకుడుగుంతలు,కేంద్ర జలశక్తి మిషన్
ప్రతీకాత్మక చిత్రం


గత కొన్నేళ్ళుగా భూగోళం వేడెక్కడం గురించి వింటున్నామని, అలా ఎందుకు జరుగుతుంది? అన్నది గమనించాలన్నారు. ఇథియోపియాలో పచ్చదనం పరుచుకుని ఉండేది కానీ ఇప్పుడు ఆ దేశం ఎడారిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ వాసులు చెట్లను నరికి కలపను ఎగుమతి చేస్తున్నారని, రోజూ దాదాపు 300 నౌకలు ఆ దేశం నుంచి కలపతో బయలు దేరుతున్నాయని ఓ అంచనా అని వివరించారు.

పర్యావరణాన్ని పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ పాత్ర
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భారతీయ న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని జస్టిస్ పసాయత్ తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలైన తొలి పర్యావరణ సంబంధ కేసు ‘గోడవర్మన్ కేసు’ నుంచి, పర్యావరణానికి మంచి చేసే విధంగానే న్యాయ వ్యవస్థ ప్రయత్నించిందని అన్నారు. ఇప్పటి వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ రక్షణకి కృషి చేస్తుంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడూ పర్యావరణను కాపాడడానికి ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు. ప్రకృతి సంపదను నాశనం చేయడాన్ని నియంత్రించడానికి పర్యవేక్షక పాత్ర వహించిందని, దానికోసమే ‘సెంట్రల్లీ ఎంపవర్డు కమెటీ’ ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం


‘2000 సంవత్సరం నుండి పర్యావరణానికి సంబంధించిన సమస్యలపై ప్రజల్లో, న్యాయవ్యవస్థలో ఎంతో చైతన్యం వచ్చింది. అటవీ, పర్యావరణ సమస్యలను పర్యవేక్షించడానికి 2010లో ‘గ్రీన్ ట్రిబ్యునల్’ ఏర్పాటైంది. ఈ మధ్య నదులకు సంబంధించిన అన్ని సమస్యలూ రివర్ ట్రిబ్యునల్ పర్యవేక్షిస్తుంది. అది ఖచ్చితంగా ఒక కాల వ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది’ అని వివరించారు.
First published: