Mission Paani: నీటిని ఆదా చేద్దాం... మిషన్ పానీతో చేతులు కలుపుదాం

నీటిని ఆదా చేద్దాం... మిషన్ పానీతో చేతులు కలుపుదాం

Mission Paani: మన దేశంలో నీటి వృథా భారీగా జరుగుతోంది. ఫలితంగా జీవ నదులు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఊరుకుంటే భవిష్యత్తులో నీటికి తీవ్ర కటకట తప్పదు.

 • Share this:
  Mission Paani: ఆఫ్రికా ఖండంలో జీవ నదులు అంతగా లేవు కాబట్టి అక్కడి ప్రజలు తాగ నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటారు. మన దేశంలో ఎన్నో జీవనదులు ఉన్నా... చలా రాష్ట్రాల్లో కూడా నీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో నీటికి విపరీతమైన కొరత ఉంటే... మరికొన్ని చోట్ల నీటిని వృథాగా పారబోస్తున్నారు. ఏళ్లుగా నీటి కొరత సమస్యను మనం చూస్తూనే ఉన్నాం. కావేరీ లాంటి నదులు పూర్తిగా ఎండిపోతున్నాయి. క్రమంగా మనం డే జీరోకి వెళ్లిపోతున్నాం. ఆ రోజున మనకు నీరు అన్నదే దొరకదు. అది భయంకరమైన పరిస్థితి. ఇప్పటికే దేశంలోని 15 ప్రధాన నగరాల్లో నీటి కొరత ఉంది. రాన్రానూ ఇలాంటి నగరాల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ప్రతి చుక్కా ముఖ్యమే... ప్రతి ఒక్కరం నీటిని పొదుపు చేయాల్సిందే.

  మనకు తెలియకుండానే మనం నీటిని వృథా చేస్తూ ఉంటాం. చాలా మంది ట్యాపులు వదిలేసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈలోగా నీరు వృథా అవుతుంది. కొంతమంది ట్యాంకుల్లో నీటిని నింపడానికి మోటర్ ఆన్ చేస్తారు. ట్యాంక్ నిండినా మోటర్ ఆపడం మర్చిపోతారు. అంతే నీరంతా రోడ్లపై వృథాగా పోతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఘటనలు. నీటిని ఆదా చేయాలనే ఆలోచన మనలోంచీ రావాలి. ప్రతీ క్షణం ఎప్పుడు నీటిని వాడినా... జాగ్రత్తగా వాడాలనే భావన మనలో కలగాలి. అది మన జీవితంలో భాగం అయిపోవాలి. అందుకోసం మనం కొన్ని అలవాటు చేసుకోవాలి. అవేంటో చూద్దాం.


  తినే ఆహారంతో నీటి ఆదా:
  మనం తినే కూరగాయలు, పండ్లు, మాంసం వంటి వాటిలో... కొన్నింటి పెంపకానికి చాలా నీరు అవసరం అవుతుంది. అలాంటి వాటిని తినడం తగ్గించి... తక్కువ నీటితో పెరిగే పంటల ఆహార ఉత్పత్తులను తినడం ప్రారంభిస్తే... ఆటోమేటిక్‌గా చాలా నీరు ఆదా అవుతుంది. వీలైనంతవరకూ బయటి కంటే... ఇళ్లలోనే వండుకొని తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లలో నీరు చాలా ఎక్కువగా వృథా అవుతూ ఉంటుంది. అదే ఇళ్లలోనైతే... నీటి బిల్లులు చెల్లించేది మనమే కాబట్టి... నీటిని పొదుపుగా వాడుకోవచ్చు.

  తక్కువ కొనుగోళ్లతో ఎక్కువ నీటి ఆదా:
  ఈ రోజుల్లో మనం కొనే పట్టలు, జీన్స్, షూ, బ్యాగ్స్ ఇలా ప్రతీదీ తయారుచేయడానికీ, ప్రాసెస్ చేయడానికీ, రవాణా చేయడానికీ నీటి అవసరం ఉంటుంది. ఒక జత జీన్స్ మీరు ఆన్‌లైన్‌లో కొంటే... వాటి తయారీకి 10,000 లీటర్ల వాటర్ వాడారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల మనం అవసరమైనంతవరకే వస్తువులను కొనుక్కోవాలి. అనవసరపు ఖర్చులను తగ్గిస్తే... డబ్బు ఆదా అవ్వడమే కాదు... నీరు కూడా ఆదా అవుతుంది.


  కరెంటు వాడకం తగ్గించి, నీటిని ఆదా చేయండి:
  మనం వాడే విద్యుత్‌లో చాలా వరకూ జలవిద్యుత్తే. కరెంటు తయారవ్వడానికి నీటిని డ్రిల్లింగ్ చేస్తారు. టర్బైన్లకు నీటిని పంపితేనే అవి తిరుగుతాయి. అవి తిరిగితేనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనం కరెంటు వాడకాన్ని తగ్గిస్తే నీటిని కూడా ఆదా చేసినట్లే. అవసరం లేని గదుల్లో లైట్లను ఆర్పేసుకోవడం, పని అయిపోగానే సెల్‌ఫోన్ ఛార్జింగ్ ఆపేయాలి. ఇంట్లోంచీ వేరే ఊరికి వెళ్తే... మెయిన్ స్విచ్ఛాప్ చెయ్యాలి. ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. దీని వల్ల మన కరెంటు బిల్లు తగ్గుతుంది, అలాగే నీరూ సేవ్ అవుతుంది.

  తక్కువ సార్లు ఉతుక్కోండి:
  ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి వాడిన బట్టలను ఉతకకుండా మళ్లీ వాడలేం. ఐతే... చాలా మంది రోజూ వాషింగ్ మెషిన్‌లో 2 లేగా 3 జతల బట్టలు వేసి ఉతికేస్తారు. ఇలా ఒకసారి వాషింగ్ మెషిన్ పనిచేస్తే అది 50 నుంచి 70 లీటర్ల నీటిని వాడేస్తుంది. ఫలితంగా తక్కువ బట్టలకు ఎక్కువ నీరు వేస్ట్ అవుతుంది. దాని బదులు... ఓ 7లేదా 8 జతలు అయ్యే వరకూ ఆగి... ఒకేసారి వాటిని వేసి ఉతికిస్తే... నీరు చాలా ఆదా అవుతుంది. కరెంటు కూడా తక్కువ అవుతుంది. ఆల్రెడీ తెలివైన మనం మరింత స్మార్ట్‌గా ఆలోచించడం మంచిదే.

  వేగంగా స్నానం ముగించండి:
  జలకాలాటలు మనందరికీ ఇష్టమే. కానీ... మనం ఐదు నిమిషాల్లో స్నానం ముగిస్తే... చాలా నీరు ఆదా అవుతుంది. మన బాత్‌రూంలో షవర్లు మనకు తెలియకుండానే చాలా నీటిని విడుదల చేస్తాయి. అందువల్ల షవర్‌ను 5 నిమిషాలకు మించి వాడకుండా జాగ్రత్త పడాలి. వీలైతే షవర్ బదులు బకెట్‌లో నీటిని స్వయంగా పోసుకుంటే... ఎంత వాటర్ అయిపోతుందీ తెలుస్తుంది. తద్వారా తక్కువ వాటర్ వాడగలం. సబ్బు లేదా షాంపూ రాసుకునేటప్పుడు షవర్‌ని ఆపేసుకుంటే ఎంతో మంచిది.

  ఇది కూడా చదవండి: Zodiac signs: మీరు మంగళవారం పుడితే... ఆ రోజున ఈ పనులు అస్సలు చెయ్యొద్దు

  ఇవన్నీ చిన్న చిన్న అంశాలే. కానీ వీటి వల్ల చాలా నీరు ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరం వీటిని అలవాటు చేసుకుంటే... దేశం మొత్తం ఎంత నీరు ఆదా అవుతుందో కదా. నీటి ఆదా కోసం హార్పిక్‌తో కలిసి న్యూస్18 మిషన్ పానీ (Mission Paani) కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా నీటి ఆదా, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. మరిన్ని వివరాలను https://www.news18.com/mission-paani లో తెలుసుకోవచ్చు. తాజాగా చేపడుతున్న మిషన్ పానీ వాటర్‌థాన్‌లో మీరూ పాల్గోండి. ఇది 8 గంటలపాటూ టెలికాస్ట్ చేసే కార్యక్రమం. ఇందులో ప్రముఖులు ఎందరో పాల్గొంటారు. వారంతా ఇండియాలో నీటి కొరత రానివ్వబోమని ప్రతిజ్ఞ చేయబోతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: