కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. కొన్ని చోట్ల ప్రాణాలను, మరికొన్ని చోట్ల స్వాతంత్ర్యాన్ని కరోనా తీసుకెళ్లింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చినప్పటికీ.. మన పరిశుభ్రంగా ఉండటం, చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి ఇంకా చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే జరగాల్సి ఉంది. శుద్ధమైన నీటి కోసం గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయన్నది కొత్త విషయమేమీ కాదు. అక్కడ నీటి సంక్షోభం ఎక్కువగా ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. స్వజల్ కార్యక్రమానికి రూ. 700 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 115 గ్రామీణ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడంతోపాటు వారికి స్వచ్ఛమైన నీరు అందించడమే ఈ పథకం లక్ష్యం. స్వచ్ఛత, పరిశుభ్రత పాటించేందుకు ఈ పథకాన్ని చెక్కుచెదరని పైపుల ద్వారా అమలు చేస్తున్నారు. దీనికి తోడు అనేక ప్రశంసలు పొందిన స్వచ్ఛ భారత్ అభియాన్ సైతం దేశంలో పరిశుభ్రతను పెంచేందుకు దోహదపడుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జనను అరికట్టేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది.
గత ఏడాది అక్టోబర్‌లో అహ్మదాబాద్ నగరంలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. దేశం బహిరంగ మల విసర్జన రహితంగా మారిందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని.. దీని వల్ల 60 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఇది నిజంగా గొప్ప విషయం. దీని కారణంగా భవిష్యత్తులో బహిరంగ మల విసర్జన అనేది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. దీని కారణంగా సామాజిక ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం అనేది ప్రజల చేతిలోనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani