Mission Paani: మన దేశంలో నానాటికీ లభ్యమయ్యే తాగు నీరు తగ్గిపోతోందని మీకు తెలుసా? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చెరువుల్లో నీరు డైరెక్టుగా తాగేవాళ్లు. మరి ఇప్పుడో చెరువులే కాదు నదుల్లో నీరు కూడా డైరెక్టుగా తాగే పరిస్థితి లేదు. అన్నీ కలుషితం. దేశమంతా తాగు నీటి కొరత. దీనంతటికీ కారణం ఉన్న నీటిని సరిగా పొదుపు చేసుకోకపోవడమే. అందుకే దేశవ్యాప్తంగా నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక మిషన్ పానీ పేరుతో ఓ భారీ ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా... మిషన్ పానీ మారథాన్ ఇవాళ నిర్వహిస్తున్నారు. న్యూస్18 గ్రూప్, హార్పిక్ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇది మొత్తం 8 గంటలపాటూ సాగే కార్యక్రమం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దీనికి హోస్టుగా ఉన్నారు. ఈ ఉద్యమ అంబాసిడర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ కార్యక్రమంలో "పానీ కీ కహానీ... భారత్‌కీ జుబానీ" థీమ్‌తో దేశంలో నీటి కొరత, అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12.30కి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో దేశంలోని ప్రముఖులు చాలా మంది నీటిని పొదుపు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు.
ఈ వాటర్‌థాన్‌లో ఏఆర్ రెహమాన్, మల్లికా సారాభాయ్, ప్రసూన్ జ్యోషీ, సద్గురు, హెచ్ హెచ్ చిదానంద స్వామి, రాజ్‌కుమార్ రావ్, మందిరా బేడీ, నేహా ధూపియా, దియా మీర్జా, గుల్ పనగ్, భూమి పద్నేకర్, విశ్వనాథన్ ఆనంద్, స్మృతి మందన తదితరులు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, రాజకీయనేతలు అంటే... కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్, టెక్స్‌టైల్, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొంటున్నారు.
It’s almost time. Are you ready to make India water secure and a hygienic nation? Join the Waterthon, and be a part of #MissionPaani a @CNNnews18 and @harpic_india initiative for water conservation and hygiene, starting 12:30 pm today. #MeriJalPratigya pic.twitter.com/hpb8fswvA5
— Mission Paani (@MissionPaani) January 26, 2021
నీటి పొదుపుతోపాటూ... ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాల్సిన అంశంపైనా ఈ ఉద్యమంలో పోరాటం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. లెఫ్టినెట్ కల్నల్ ఎస్జీ దాల్వీ వంటి ఎంతో మంది పరిశుభ్రతపై ప్రచారం కల్పిస్తుంటే... అమలా రుయా వంటివారు... నీటి కొరతపై పోరాడుతున్నారు. ఇలా ఎంతో మంది నీటిని పొదుపు చేయడం ఎలా, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎలా, నీటి లభ్యత పెంచేందుకు ఏం చెయ్యాలి, పరిశుభ్రతను ఎలా పెంచాలి, మురికి వాడల్లో ప్రజలకు మేలైన జీవితాన్ని ఎలా అందించాలి... వంటి అంశాలపై ఈ ఉద్యమం ద్వారా మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Leopard Videos: సిటీలోని పెట్రోల్ బంకుకి వచ్చిన చిరుతపులి... ఏం చేసిందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటం వల్ల... రేపు చట్టాలు చేసేదే వాళ్లు కాబట్టి... నీటి పొదుపు కోసం ప్రభుత్వం నుంచి ఏం చెయ్యాలి, ఏయే నిర్ణయాలు తీసుకోవాలో వారికి అర్థమవుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని న్యూస్18 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani