హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

#MissionPaani: మరో నగరానికి పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి సమస్య

#MissionPaani: మరో నగరానికి పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి సమస్య

Mission Paani | రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు తీవ్ర నీటి సమస్య ఏర్పడే ముప్పు పొంచి ఉంది. మరో నెల రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. మరో నెల రోజుల్లో సరిగ్గా వర్షాలు కురవకుంటే తాగునీటికి కటకట తథ్యంగా తెలుస్తోంది.

  చెన్నై మహానగర ప్రజలు నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. అటు రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి కూడా తీవ్ర నీటి సమస్య పొంచి ఉంది. మరో నెల రోజుల్లో అక్కడ సరైన వర్షాలు కురవకుంటే తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి తథ్యంగా తెలుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆ నగరంలో భూకర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. 30 లక్షల మంది జనాభాతో కూడిన జైపూర్‌ నగర నీటి అవసరాలకు ప్రధాన ఆధారమైన బిలాస్‌పూర్ డ్యామ్‌లో మరో నెల రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. బిలాస్‌పూర్ డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 1,095 క్యూసెక్కుల మీటర్లు కాగా...ప్రస్తుతం అందులో 64.93 క్యూసెక్కుల మీటర్ల(5.93 శాతం) నీరు మాత్రమే ఉంది.

  jaipur water scarcity, water problem, jaipur news, rajasthan news, water scarcity, జైపూర్, నీటి ఎద్దడి, రాజస్థాన్, తాగునీటి సమస్య, మిషన్ పానీ
  అడుగంటిపోయిన బిలాస్‌పూర్ డ్యామ్

  ఈ ఏడాది ఇప్పటి వరకు జైపూర్‌లో 116 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి అక్కడ 225 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ పరిస్థితుల్లో జైపూర్‌‌కు తీవ్ర నీటి సమస్య పొంచి ఉన్నట్లు రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే 60 శాతం కంటే తక్కువ వర్షపాతమే ఇప్పటి వరకు కురిసింది. రాష్ట్రంలోని దాదాపు సగం ప్రాంతం(పశ్చిమ రాజస్థాన్)లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజస్థాన్‌లో గత దశాబ్ధకాలంలో భూగర్భ జలాలు 62 శాతం మేర తగ్గాయి.

  jaipur water scarcity, water problem, jaipur news, rajasthan news, water scarcity, జైపూర్, నీటి ఎద్దడి, రాజస్థాన్, తాగునీటి సమస్య, మిషన్ పానీ
  ప్రతీకాత్మక చిత్రం

  వచ్చే ఏడాది బెంగళూరు సహా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటి నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశముందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల పట్ల పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నీటిని వృధా కాకుండా ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని సూచిస్తున్నారు. వర్షపు నీరు వృధా కాకుండా తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పటు చేసుకోవాలని కోరుతున్నారు.

  First published:

  Tags: Mission paani, Rajasthan, Save water, Water Crisis

  ఉత్తమ కథలు