Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: ఇన్ని జలవనరులు ఉన్నా.. ఎందుకీ నీటి కష్టాలు.. ఏంటి పరిష్కారం?

Mission Paani: ఇన్ని జలవనరులు ఉన్నా.. ఎందుకీ నీటి కష్టాలు.. ఏంటి పరిష్కారం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీటి సమస్య పరిష్కారం... కేవలం ప్రభుత్వాల పనికాదు. మనందరి బాధ్యత. నీటిని వృథా చేయకూడదు. ఒక్క బొట్టును కూడా వదులుకోకూడదు. నీటి సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలి.

చుట్టూ సముద్రమే.. దేశం నిండా నదులే.. ఐనా తాగునీటి సమస్య మన దేశాన్ని వేధిస్తోంది. వేసవి వచ్చిందంటే చాటు గుక్కెడు నీళ్లు లేక ఎంతో మంది ప్రజలు అల్లాడుతారు. ప్రపంచవవ్యాప్తంగా ఉన్న శుద్ధమైన నీటిలో 4శాతం ఇండియాలో ఉంది. మన దేశంలో మనకు సరిపడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. సముద్రాలు, నదులు, సరస్సుల రూపంలో సమృద్ధిగా జల సంపద ఉంది. భారత్‌లో 10,360 నదులు దేశం పొడవునా ప్రవహిస్తున్నాయి. వాటి ద్వారా 1,869 ఘనపు కి.మీ. నీరుంది. ఇంత నీరున్నా అందులో మనం చాలా వరకు వాడుకోలేం. కానీ సరైన పద్దతిలో మనం నీటి వనరులను ఉయోగిస్తే నీటి కొరత కష్టాలు తీరుతాయి.

మన దేశంలో గంగా, యుమనా, బ్రహ్మపుత్ర నదులను చూస్తేనే ఉన్నాం. వర్షా కాలంలో ఉప్పొంగి ప్రవహిస్తాయి. కానీ నీటి కాలుష్యం వలన వాటిని మనం వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలతో నదులు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయాయి. తద్వారా ఆ నదులపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు సాగు నీరుగా.. అటు తాగునీటిగా.. దేనికీ మన నదీ జలాలు పనికి రాకుండా పోతున్నాయి. కానీ దేశంలో ప్రవహించే నదులన్నింటిపై సరైన నిర్వహణ పాటిస్తే చక్కగా వినియోగించుకోవచ్చు.

ఇక భూగర్భ జలాల విషయానికొస్తే.. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. పల్లెల్లో ఇప్పటికీ ఇదే దిక్కు. బోర్లు, చేతి పంపులే వారికి ఆధారం. ఐతే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. పలు చోట్ల కరువు తాండవిస్తోంది. నేలల నెర్రలు బారుతున్నాయి. అలాంటి చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు, తాగు నీటి కష్టాలతో అల్లాడిపోతున్నారు. వ్యవసాయం కూడా చేయలేకపోతున్నారు. అందుకే భూగర్భ జలాలపై నియంత్రణ ఎంతైనా అవసరం. వర్షా కాలంలో భూగర్భజలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంకుడు గుంతలు తవ్వడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.

వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ.. మన దేశంలో సమృద్ధిగానే వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి అధిక వర్షపాతం కురిసింది. మనదేశంలో ఏటా 4వేల ఘనను కిలోమీటర్ల మేర వర్షపు నీరు సమకూరుతుంది. ఐతే ఈ వాన నీటిని ఒడిసి పట్టుకోవాలి. భవిష్యత్ కోసం నిల్వ చేసుకోగలగాలి. వాన నీటి సంరక్షణపై ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా.. ఇప్పటికే ఎంతో నీరు వృథా అవుతోంది. వాన నీటి సంరక్షణ ద్వారా తాగు నీటి సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ వాన నీటి ద్వారానే సులభంగా, తక్కువ ఖర్చుతో అందరికీ మంచి నీటిని అందించవచ్చు. వాన నీరు మనకు ప్రకృతి అందించే కానుక. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకూడదు.

ఐతే నీటి సమస్య పరిష్కారం... కేవలం ప్రభుత్వాల పనికాదు. మనందరి బాధ్యత. నీటిని వృథా చేయకూడదు. ఒక్క బొట్టును కూడా వదులుకోకూడదు. నీటి సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలి. ఎవరికి వారు నీటి నిర్వహణపై నియంత్రణ చేపట్టాలి. ఇదే మంచి సమయం. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయండి. నీటిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయండి. నీటి ఆదా కోసం హార్పిక్‌తో కలిసి న్యూస్18 మిషన్ పానీ (Mission Paani) కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా నీటి ఆదా, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. మరిన్ని వివరాలను https://www.news18.com/mission-paani లో తెలుసుకోవచ్చు. తాజాగా చేపడుతున్న మిషన్ పానీ వాటర్‌థాన్‌లో మీరూ పాల్గోండి. ఇది 8 గంటలపాటూ టెలికాస్ట్ చేసే కార్యక్రమం. ఇందులో ప్రముఖులు ఎందరో పాల్గొంటారు. వారంతా ఇండియాలో నీటి కొరత రానివ్వబోమని ప్రతిజ్ఞ చేయబోతున్నారు.

First published:

Tags: Mission paani, Save water

ఉత్తమ కథలు