హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: జలమే జీవాధారం.. నీటి వృథాను అరికట్టడానికి ఈ పది సింపుల్ చిట్కాలను పాటించండి..

Mission Paani: జలమే జీవాధారం.. నీటి వృథాను అరికట్టడానికి ఈ పది సింపుల్ చిట్కాలను పాటించండి..

నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిగా వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో మనం చాలా నీటిని సేవ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

  మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికం అవుతోంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృథా అని చెప్పక తప్పదు. నీరు ఉన్న వారు ఇష్టారీతిగా వృథా చేస్తుంటే లేని వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిగా వృథా చేసుకుంటూ పోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో మనం చాలా నీటిని సేవ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి చాలా పరిమాణంలో నీటిని సేవ్ చేయవచ్చు. అవేంటో చూద్దాం.

  -చాలా మంది ఇళ్లల్లో బంద్ చేసిన తర్వాత కూడా నల్లాల నుంచి నీటి చుక్కలు పడుతూనే ఉంటాయి. అలాంటి వాటికి మరమ్మతులు చేయించడం మంచిది. లేక పోతే వాటిని పూర్తిగా బంద్ చేయాలి. అది కూడా కుదరకపోతే ఎప్పుడూ వాటి కింద ఓ బకెట్ పెడితే అందులో పడిన నీటిని ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.

  -చాలా మంది వాషింగ్ మిషన్ లో ఎప్పటికప్పుడు బట్టలు వేయడం చేస్తుంటారు. అలా కాకుండా ఎక్కువ బట్టలు అయినప్పుడు ఒకే సారి వేయడం వల్ల చాలా నీటిని సేవ్ చేసుకోవచ్చు.

  -అనేక మంది బ్రష్ చేసుకునే సమయంలో నల్లాను అలానే ఆన్ చేసి పెడతారు. బ్రష్ చేసుకోవడం పూర్తయ్యే వరకు నల్లా నీరు అలా వృథాగనే వదిలేస్తూ ఉంటారు. అయితే బ్రష్ చేసుకోవడం ప్రారంభించే సమయంలో బ్రష్ ను తడుపుకుని, వెంటనే ఓ గ్లాస్ లో నీరు పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. అనంతరం బ్రష్ చేసుకోవడం పూర్తి అయిన తర్వాత నల్లాను ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కనీసం ఓ బకెట్ నీరు అయినా వృథా కాకుండా కాపాడవచ్చు.

  -మొక్కలకు నీటిని ఉదయం సమయంలో అందించడం మంచిది. అలా చేయడం వళ్ల నీరు అవిరి అవడం తగ్గుతుంది. దీంతో పాటు మొక్కలకు కూడా సరిపడా నీరు అందుతుంది. మొక్కలకు డ్రిప్ విధానం ద్వారా నీరు అందించడం ఇంకా మంచిది.

  -నీటిని గ్లాసులతో కన్నా బాటిల్ ద్వారా తాగడం మేలు. గ్లాసులతో తాగిన సమయంలో మిగిలిన నీటిని మనం పారబోస్తూ ఉంటాం. ప్రతీ సారి నీటిని బిందెల్లో ముంచడం వల్లా కూడా వృథా అవుతుంది. అదే బాటిళ్లోని వాటర్ అయితే మూతపెట్టుకుని తర్వాత తాగే అవకాశం ఉంటుంది.

  -కూరగాయలు కడిగిన అనంతరం చాలా మంది ఆ వృథా నీటిని పారబోస్తూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల మన డ్రైనేజీలు నిండిపోవడంతో పాటు నీరు వృథా అవుతుంది. ఆ నీటిని కూరగాయలకు పోయడం వల్ల సేవ్ చేయవచ్చు.

  -మన ఇళ్లల్లోని పైపులు ఎక్కడైనా లీక్ అవుతున్నాయా? లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పైపులు లీక్ అవ్వడం వళ్ల నీరు వృథా అవ్వడంతో పాటు అందులోకి మట్టి లాంటి వ్యర్థాలు చేరి అనారోగ్యాలు కూడా వస్తాయి.

  -మన ఇళ్లల్లో నీరు అత్యధికంగా వృథా అయ్యే ప్రదేశం బాత్రూమ్ అని చెప్పొచ్చు. అక్కడ నల్లాలు సాధారణంగా లీక్ అవుతూ ఉంటాయి. దీంతో మనకు తెలియకుండానే లీటర్ల కొద్దీ నీరు వృథా అవుతుంది. అలా జరగకుండా జాగ్రత్త పడడం మంచిది.

  -చాలా మంది బాత్రూమ్ కు వెళ్లినప్పటి నుంచి షవర్ ఆన్ చేసే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల నీరు అధికంగా వృథా అవుతుంది. ఐదు నిమిషాలు షవర్ ఆన్ లో ఉంటే దాదాపు 4 నుంచి ఎనిమిది లీటర్ల నీరు వృథా అయిపోతుంది. షవర్ వాడకాన్ని ఐదు లేదా పది నిమిషాలకు పరిమితం చేయడం మంచిది.

  -షవర్ లో నుంచి నీరు స్పీడ్ గా రాకుండా చూసుకోవడం మంచిది. ఇందు కోసం రెగ్యులేటర్లను వాడాలి. ఇలా చేయడం ద్వారా మనం చాలా పరిమాణంలో నీటిని సేవ్ చేసుకోవచ్చు.

  First published:

  Tags: Mission paani, Save water, Water Crisis

  ఉత్తమ కథలు