Mission Paani: బాలీవుడ్ నటి, యుఎన్ నేషనల్ గుడ్ విల్ అంబాసిడర్- ఇండియా దియా మీర్జా, నెట్‌వర్క్ 18 చొరవతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పానీ వాటర్‌థాన్‌లో కలిసి సాగేందుకు భాగస్వాములయ్యారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు నీటి కొరత ముప్పుపై అవగాహన కల్పించడమే ధ్యేయంగానూ, అలాగే నీటిని రీసైక్లింగ్ చేయడం, దాని పరిరక్షించడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దియా మీర్జా ఈ గొప్ప ప్రయత్నంలో చేతులు కలిపారు. అయితే ఈ రంగంలో ఇప్పటికే దియా గత 10 సంవత్సరాలుగా చురుకుగా పనిచేస్తోంది. ఈ సందర్బంగా మిషన్ పానీ హోస్ట్, ప్రచార అంబాసిడర్ అయిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఒక నటుడు లేదా ఒక ప్రముఖ వ్యక్తి సామాజిక కార్యక్రమంతో భాగస్వామ్యం కలిగి ఉంటే అది సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పునరుద్ఘాటించారు. అదే విషయాన్ని అంగీకరిస్తూ దియా మీర్జా సైతం అంగీకరించారు. మీరు మీ పని ద్వారా ఇతరులను చేరుకోగలరని మీరు గ్రహించినప్పుడు జీవితం అర్థం మారుతుంది. ఈ ప్రయత్నం నా జీవితాన్ని మార్చివేసిందని ఆమె తెలిపారు. అలాగే ప్రస్తుతం దెబ్బతిన్న వాటిని పరిష్కరించడానికి, 10 సంవత్సరాల కన్నా తక్కువ సమయం ఉందని, అయితే ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా మారితే, అది పెద్ద మార్పును తెస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
వాతావరణ మార్పు, నీటి సంక్షోభం వల్ల మనం ఒక దేశం ఎంత ఘోరంగా ప్రభావితమవుతున్నాయో తాను ఒక అంతర్జాతీయ ఫౌండేషన్ కోసం పనిచేస్తున్నప్పుడు గ్రహించినట్లు మీర్జా గుర్తు చేసుకున్నారు. పరిస్థితి చూసి అప్రమత్తమైన ఆమె దానిపై మరింత పనిచేయాలని నిర్ణయించుకున్నారు. "2030 నాటికి మనం ఎదుర్కొనే నీటి కొరత గురించి తెలుసుకున్నప్పుడు, ఎంతో భయం వేసిందని, ఒక వ్యక్తిగా మీరు కూడా ఇందులో భాగస్వాములై నీటి పరిరక్షణకు ఎలాంటి వైవిధ్యం చూపవచ్చో గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మొదటి విషయం మీరు నివసించే భవనాలలో నీటి చెక్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇది లీకేజీ లేదా నీటి ప్రవాహం లేదని నిర్ధారిస్తుంది. వాహనాలను కడగడానికి నీటిని వాడకుండా ఇతర పద్ధతుల అవలంబించడం ద్వారా ఎంతో నీరు ఆదా అయ్యిందని మీర్జా తన అనుభవాలను పంచుకున్నారు.
అలాగే కుళాయిల నుండి నీటి ప్రవాహ తీవ్రతను తగ్గించే పరికరాలను వాడాలని, దీంతో పాటు చేతులను సబ్బుతో కడిగేటప్పుడు కుళాయిలను మూసివేయాలని ఆమె సూచించారు. నీటిని సంరక్షించడం అత్యవసరం అని, మనం దానిని కలుషితం చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అని ఆమె నొక్కి చెప్పారు. నీటిని కలుషితం చేయకుండా నివారించడానికి ఇంటి పని కోసం టాక్సిన్ లేని మరియు రసాయన రహిత సబ్బు మరియు డిటర్జెంట్లను ఉపయోగించాలని ఆమె సిఫార్సు చేశారు.
న్యూస్ 18 మరియు హార్పిక్ ఇండియా చొరవతో మిషన్ పానీ వాటర్‌థాన్, ప్రముఖులు, నాయకులు, మార్పును కోరేవారిని ఒకచోట చేర్చి నీటిని ఆదా చేయడం మరియు రాబోయే తరాల కోసం దానిని కొనసాగించే ప్రయత్నం కోసం చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం భారతదేశంలో నీటి సంక్షోభం గురించి అవగాహన పెంచే ఇతివృత్తమైన ‘పానీ కి కహానీ, భారత్ కి జుబానీ’ ఆవశ్యకతను నొక్కి చెప్పనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mission paani, Mission pani