నీరు ప్రాణికోటికి జీవాధారం. మనిషితో పాటు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి నీరు అవసరం. అందుకే నీటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత. నీటిని కాపాడుకోవడంలో మనం విఫలమైతే.. మన ఉనికే ప్రమాదంలో పడుతుందన్నది ఎవరూ కాదనలేని విషయం. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు, పల్లెలు స్వచ్ఛమౌన నీటి కోసం ఎప్పటికప్పుడు ఇబ్బందిపడుతున్నాయి. నీటిని కాపాడుకోవాలనే నినాదంతో న్యూస్ 18, హర్పిక్ ఇండియా సంయుక్తగా మిషన్ పానీ అనే అవగాహన కార్యక్రమం చేపట్టాయి. ఇందులో అనేక మంది సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సహా అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం మహిళలు ఎంత దూరం వెళతారనే విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ కళ్లకు కట్టినట్టు చూపించారు. పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం మహిళలు 20 కిలోమీటర్ల దూరంగా ప్రయాణిస్తున్న దాఖలాలు ఉన్నాయనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలిపారు. ఇందుకోసం కార్యక్రమం స్టేజీ మీదే థ్రెడ్ మిల్‌లు ఏర్పాటు చేశారు. దానిపై నడుస్తూ నీటి కోసం కిలోమీటర్ల దూరంగా నడవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో వివరించారు. తాగునీటి కోసం మహిళలు పడుతున్న ఈ ఇబ్బందులు తొలిగిపోవాలని అన్నారు.
Akshay Kumar (@akshaykumar) and @AnchorAnandN talk to two women who walk long distances for water, just a few hours away from Mumbai. #MissionPaani #MeriJalPratigya @harpic_indiahttps://t.co/golU4nE0Bp pic.twitter.com/OHi1QjYD0y
— News18.com (@news18dotcom) January 26, 2021
ఈ మిషన్ వాటర్‌థాన్‌లో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ నీటి పొదుపు అవశ్యకతను వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా సాంకేతికను ఉపయోగించి దేశంలోని ప్రజలందరికి నీటిని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. "భూగర్భ జలాలను ఆదా చేయడం మన బాధ్యత. తాగునీటిని పరిశుభ్రంగా ఉంచుకోవవడం కూడా మన బాధ్యతే. కేంద్ర ప్రభుత్వం వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సాంకేతికతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నీటిని అందించడమే దీని లక్ష్యం. మన ప్రతి చిన్న సహకారం మన ఆరోగ్యానికి మరియు దేశం సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది" అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Mission paani