Home /News /national /

MISSING POSTERS OF BJP MP AND MLA SURFACE IN BENGALS ALIPURDUAR PVN

MP,MLA Missing Posters : బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు

ఎంపీ,ఎమ్మెల్యే కనబడుట లేదంటూ పోస్టర్లు

ఎంపీ,ఎమ్మెల్యే కనబడుట లేదంటూ పోస్టర్లు

MP,MLA Missing posters : తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిత్యం తమకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకోవడడం సహజం. అయితే అతికొద్ది మంది నేతలు మాత్రమే నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాలు లేదా సమస్యలను తీరుస్తుంటారు. అయితే చాల మంది నేతలు మాత్రం ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చి గెలిచాం అని తెలిసిన తర్వాత మళ్లీ ఎన్నికల వచ్చే వరకూ తమను ఎన్నుకున్న నియోజకవర్గం మొఖం కూడా చూడరు.

ఇంకా చదవండి ...
MP,MLA Missing posters : తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిత్యం తమకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకోవడడం సహజం. అయితే అతికొద్ది మంది నేతలు మాత్రమే నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాలు లేదా సమస్యలను తీరుస్తుంటారు. అయితే చాల మంది నేతలు మాత్రం ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చి గెలిచాం అని తెలిసిన తర్వాత మళ్లీ ఎన్నికల వచ్చే వరకూ తమను ఎన్నుకున్న నియోజకవర్గం మొఖం కూడా చూడరు. .తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా నియోజకవర్గం వైపు వెళ్లరు కొందరు ప్రజాప్రతినిధులు(Public Representatives).అడపా దడపా నియోజకవర్గానికి వచ్చినా సొంత పనులు చూసుకొని వెళ్లిపోవడం తప్ప ప్రజలను సమస్యలను లేదా ఇబ్బందులను తీర్చే ఓపిక వారికి ఉండదు

. అయితే ఎన్నికలు ముగిసినప్పటి నంచి మా ఎమ్మెల్యే లేదా ఎంపీ మా ఊరు మొఖం చూడలేదంటూ గతంలో పలు చోట్ల ప్రజలు పోస్టర్లు వేసిన సంఘటనలు తెలిసిందే. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ బాధలను పంచుకోవాలని, తమను ఆదుకోవాలనుకుంటారు. అయితే తాజాగా వెస్ట్ బెంగాల్(West Bengal) లోని అలీపూర్‌ దువార్‌ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన జాన్‌ బార్లా, ఫలకటా ఎమ్మెల్యే దీపక్‌ బర్మన్‌ కనిపించడం లేదంటూ నియోజకవర్గంలో పోస్టర్లు(MP,MLA Missing Posters) అంటించారు. . ఆ పోస్టర్లలో ఇద్దరు బీజేపీ నేతల చిత్రం ఉందని, వారిద్దరినీ వెతకాల్సిన అవసరం ఉందని రాసి ఉంది.

ALSO READ Professor Sacked : శ్రీరాముడిని కించపర్చేలా మాట్లాడిన ప్రొఫెసర్..చివరికి ఉద్యోగం పోయి రోడ్డున

ఆ ఎంపీ,ఎమ్మెల్యేని వెతికి పెట్టాలని పోలీస్‌ స్టేషన్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) నాయకులు మిస్సింగ్‌ కంప్లెయింట్ కూడా ఇచ్చారు. ఇటీవల అలీపుర్‌ దువార్‌ లో తుపాన్ కారణంగా అపార నష్టం జరిగింది. ఇంత పెద్ద ప్రకృతి వైపరీత్యం జరిగినా ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ ఈ ప్రాంతాన్ని సందర్శించలేదని,ప్థానిక ప్రజలు ఎలా ఉన్నారో అని కూడా పరామర్శించలేదని టీఎంసీ నాయకుడు శుభబ్రత డే ఆరోపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే దీపక్ బర్మన్ ఈ ఆరోపణలను ఖండించారు. తుపాన్ వచ్చినప్పుడు తాను రాజధాని కోల్‌కతాలో ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు. తాను డీఎంకు లేఖ రాశానని, ఎమ్మెల్యే ఖాతా నుంచి నష్టాన్ని భర్తీ చేయాలని కోరానని ఇంకా సమాధానం రాలేదని బర్మన్ చెప్పారు. టీఎంసీ నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Leader missing, Missing person, TMC, West Bengal

తదుపరి వార్తలు