హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Chhattisgarh Encounter: అంకుల్ ప్లీజ్ మా నాన్నను వదిలేయండి.. కన్నీటితో మావోలను వేడుకుంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్‌సింగ్ కూతురు..

Chhattisgarh Encounter: అంకుల్ ప్లీజ్ మా నాన్నను వదిలేయండి.. కన్నీటితో మావోలను వేడుకుంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్‌సింగ్ కూతురు..

తండ్రిని విడిచిపెట్టాలని కోరుతున్న రాకేశ్వర్‌సింగ్ కూతురు

తండ్రిని విడిచిపెట్టాలని కోరుతున్న రాకేశ్వర్‌సింగ్ కూతురు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోలు సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్‌సింగ్‌ను అపహరించారు. ఈ క్రమంలోనే తన తండ్రిని విడిచిపెట్టాలని రాకేశ్వర్‌సింగ్ కూతురు మావోలను వేడుకుంటుంది.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరో 31 మంది గాయపడ్డారు. అయితే కోబ్రా బెటాలియన్‌ కమాండో రాకేశ్వర్‌సింగ్ ఆచూకీ కనిపించకుండా పోయింది. ఈ సమయంలోనే రాకేశ్వర్ సింగ్‌ మిన్హాస్‌ను యనను తమ ఆధీనంలోనే ఉన్నట్టుగా మావోయిస్టులు ప్రకటించారు. నిజంగానే మావోలు రాకేశ్వర్‌ అపహరించారా లేదా అని నిర్ధారించుకునేందుకు సెక్యూరిటీ దళాలు, నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. రాకేశ్వర్‌సింగ్ కనిపించకుండా పోయాడనే వార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాకేశ్వర్‌ను క్షేమంగా తీసుకురావాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. రాకేశ్వర్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా చర్యలు తీసుకోవాలని రాకేశ్వర్ భార్య మీనూ మిన్హాస్‌, ఇతర కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, జమ్మూ కశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్.. 2011లో సీఆర్పీఎఫ్‌లో చేరారు.

‘మాకు ఈ ఎన్‌కౌంటర్ గురించి, నా భర్త మిస్సింగ్ గురించి న్యూస్ చానెల్స్ ద్వారానే తెలిసింది. ప్రభుత్వం నుంచి గానీ, సీఆర్పీఎఫ్ నుంచి ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. నా భర్త అపహరణ గురించిన సమాచారం తెలుసుకోవడానికి జమ్మూ కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్ హెడ్ క్వార్టర్స్‌ను చేరుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాను. అక్కడ అధికారులు మీతో చెప్పడానికి ఏమి లేదు.. ఒక్కసారి స్పష్టమైన అవగాహన వచ్చిన సమాచారం తెలియజేస్తాం అని అన్నారు. చివరిసారిగి శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో నా భర్తతో మాట్లాడాను. ఆ తర్వాత అతను విధుల్లోకి వెళ్లాడు. నా భర్త పదేళ్లుగా దేశం కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం అతడిని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేయాలి’మీనూ మిన్హాస్‌ తెలిపారు.


ఇక, ‘నక్సల్ అంకుల్ ప్లీజ్‌.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ రాకేశ్వర్‌సింగ్ కూతురు శ్రాగ్వి(5)మావోయిస్టులను వేడుకుంది. తన తండ్రిని విడిచిపెట్టాలని ఏడుస్తూ విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు జవాన్ రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడంటూ మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు హక్కుల సంఘం నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అక్కడి హక్కుల నాయకుడు సోను సోరుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

First published:

Tags: Chhattisgarh, CRPF, Encounter, Jammu and Kashmir

ఉత్తమ కథలు