ఇంటి చుట్టూ విశాలమైన సుందర ప్రాంతం. ఆ వాతావరణానికి మంత్ర ముగ్దులైన ఆ చిన్నారి ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది. అదో ఆ చిన్నారికి శాపమైంది. యమ లోకానికి ద్వారం అయింది. తమ కళ్ళు అంతసేపు ఆడుకుంటూ కనిపించిన ఆ చిన్నారి నిర్జీజీవిగా మారడంతో చూసినవారి గుండె తరుక్కుపోయింది. నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్పై చిరుత పులి ఘాతుకానికి పాల్పడింది. జమ్మూ-కాశ్మీర్లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాలనీలో చిన్నారి అధా ఆడుకుంటూ ఉండగా చిరుత పులి పొదల్లోకి లాక్కొని వెళ్ళి చంపేసింది.
బయట పాప ఏడుస్తున్న శబ్ధాన్ని విన్న కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళి చూసే సరికి కనిపించలేదు. దీంతో పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చూట్టూ పక్కల అంతా వెతికారు. ఎంతకీ పాప అచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చెప్పట్టారు. మరుసటి రోజు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని అటవి అధికారులు గుర్తించారు. పాప ఒంటిపై చారలు గుర్తించిన అధికారులు పులి చిన్నారి చంపి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధాంచారు. అయితే చిన్నారి మరణంపై స్థానికులు, పలువురు రాజకీయ నేతలు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళ పరిసర ప్రాంతాలలో వన్య మృగాలు తిరుగుతుంటే చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu kashmir, Leopard