భారతదేశానికి చెందిన 21 ఏళ్ల నటి మోడల్ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) చరిత్ర సృష్టించింది. ఇజ్రాయెల్ (Israel)లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 టైటిల్‌ను హర్నాజ్ సంధు గెలుచుకుంది. విశ్వయవనికపై భారత్ మరోసారి సత్తా చాటుకుంది. అందాలపోటీలో భారతీయ ముద్దుగుమ్మ అనూహ్య విజయం సాధించింది. మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకుంది. Miss Universe 2021గా మన పంజాబీ పిల్ల హర్నాజ్ కౌర్ సంధు నిలిచింది. ఈ పోటీల్లో 79 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వారందరిని దాటి హర్నాజ్ టైటిల్ గెలుచుకొంది. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందించిందిన ఘనత హర్నాజ్ సాధించింది. అంతకుముందు 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
70వ మిస్ యూనివర్స్ పోటీ వేడకకు ఇజ్రాయెల్‌లోని ఐలాట్ ఆతిథ్యం ఇచ్చింది. గతేడాది మిస్ యూనివర్స్ మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని హెర్నాజ్ గెలుచుకుంది. ఈ పోటీలో టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా హర్నాజ్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. అదే సమయంలో పరాగ్వేకు చెందిన 22 ఏళ్ల నదియా ఫెరీరా రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన 24 ఏళ్ల లాలెలా మస్వానే ఉంది.
సమాధానమే టైటిల్‌ను అందించింది..
నేటి కాలంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహిళలకు ఏం సలహా ఇస్తారని సంధును అడిగారు. ఈ ప్రశ్నకు హర్నాజ్ చాలా చక్కగా సమాధానమిచ్చారు. నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి తనను తాను నమ్ముకోకవడం. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడండి. మీ కోసం మాట్లాడండి ఎందుకంటే మీరు మీ జీవితానికి నాయకుడు, మీరు మీ వాయిస్. నన్ను నేను నమ్ముకున్నాను అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. అని ఆమె తెలిపింది.
ఎవరు హర్నాజ్ సంధు?
హర్నాజ్ సంధు.. చండీగఢ్‌కు చెందిన మోడల్. ఈమె మోడలింగ్, అనేక పోటీలలో పాల్గొంది మరియు వాటిలో గెలిచినప్పటికీ, ఆమె తన చదువుపై దృష్టి పెట్టింది. హర్నాజ్ 2017లో మిస్ చండీగఢ్ టైటిల్ కూడా గెలుచుకుంది. అనంతరం ఆమె మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. హర్నాజ్ మిస్ ఇండియా 2019లో పాల్గొని టాప్ 12కి చేరుకుంది. హర్నాజ్ సంధు కొన్ని పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Miss universe news