Miss India 2019 : ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచిన సుమన్ రావు

Miss India 2019 : రాజస్థాన్‌కి చెందిన సుమన్ రావు 2019 సంవత్సరానికి మిస్ ఇండియాగా ఎన్నికయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 11:40 AM IST
Miss India 2019 : ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచిన సుమన్ రావు
మిస్ ఇండియా 2019 సుమన్ రావు (Image : Instagram / missindiaorg
  • Share this:
Miss India 2019 Suman Rao : ఎదురుచూపులు ముగిశాయి. 2019 మిస్ ఇండియా ఎవరో ప్రకటించేశారు. మరెవరో కాదు రాజస్థాన్‌కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడుకు చెందిన మాజీ మిస్ ఇండియా అనుకీర్తి వాస్... మిస్ ఇండియా కిరీటాన్ని సుమన్ రావుకి ధరింపజేసింది. గతేడాది రన్నరప్‌ గా నిలిచిన హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి... ఈ ఏడాది రన్నరప్‌కి తన కిరీటాన్ని బహూకరించింది. అలాగే 2018లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు కామవరపు... ఈ ఏడాది తన కిరీటాన్ని సెకండ్ రన్నరప్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన సంజనా విజ్‌కి తొడిగింది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ నిలవగా... మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది. ఆమె ఫస్ట్ రన్నరప్ కూడా.




మిస్ ఇండియా పేజెంట్ 2019 ఫైనల్ ఈవెంట్‌కి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తరలివచ్చారు. బాలీవుడ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, మనీష్ పాల్, మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్ కలిసి ఈ ఈవెంట్‌కి హోస్ట్స్‌గా వ్యవహరించారు.



బాలీవుడ్ దివాస్ హుమా ఖురేషీ, దియా మీర్జా, నేహా ధూపియా, చిత్రాంగధా సింగ్ తదితరులు కూడా హాజరయ్యారు. మొత్తం 30 మంది అందమైన అమ్మాయిలు తమ తమ రాష్ట్రాల నుంచీ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. కొన్ని నెలలుగా హార్డ్ వర్క్ చేశారు. ర్యాంప్ వాక్, ఫిట్‌నెస్, హెల్త్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు.



ఫెమినా మిస్ ఇండియా 2019... 56వ మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్. ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది.








First published: June 16, 2019, 5:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading