రోజూ మొక్క నాటే గ్రీన్ గురూజీ..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:46 PM IST
రోజూ మొక్క నాటే గ్రీన్ గురూజీ..!
  • News18
  • Last Updated: June 6, 2018, 2:46 PM IST
  • Share this:
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అంతటా పర్యావరణ పరిరక్షణ గురించే చర్చ జరుగుతోంది.  వాతావరణంలో పెరుగుతన్న కార్భన్ డయాక్సైడ్, పెరుగుతున్న భూతాపం గురించి యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌ నుంచి భూమండలాన్ని కాపాడాలంటే చెట్లను అధికంగా నాటాలి.  కొందరు అప్పుడప్పుడూ మొక్కలు నాటుతారు.కానీ కొందరు మాత్రం మొక్కల పెంపకాన్ని యజ్ఞంలా చేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ మాస్టారు.

ఈయన పేరు అనిల్ ‌సింగ్. యూపీలోని మిర్జాపూర్ నివాసి. టీచర్లు  విద్యార్థులకు పాఠాలు చెబుతారు. కానీ ఈయన దాంతో పాటు పచ్చదనాన్నీ పంచుతున్నారు. అందుకే అందరూ గ్రీన్ గురూజీ అని ముద్దుగా పిలుస్తారు. రోజుకు ఒక మొక్కైనా నాటనిదే ఈయనకు రోజు  గడవదు. ప్రభుత్వ సాయం లేకుండానే సొంతంగా మొక్కలు నాటుతున్నారు. రోజూ ఉదయం ఒక మొక్క నాటడం అలవాటుగా చేసుకున్నారు అనిల్‌ సింగ్. అనుకోని పరిస్థితుల వలన ఉదయం నాటకున్నా.. రాత్రి పడుకునే లోపు ఖచ్చితంగా మొక్కను నాటుతారు.

జులై1, 2015 నుంచి రోజూ మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు అనిల్ సింగ్. జులై 5 (ప్రపంచ పర్యావణ దినోత్సవం) వరకు ఆయన నాటిన మొత్తం మొక్కల సంఖ్య  1,171.  స్కూల్లో విద్యార్థులకు పాఠాలు  చెప్పాక, ఫ్యామిలీతో కొంత సమయం గడిపాక.. మిగిలిన సమయాన్నంతా ప్రకృతికే  కేటాయిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు సాయం చేస్తున్నాడు. వీరి ఇంటి ఆవరణలో 50 రకాల వ‌ృక్ష జాతులు కనిపిస్తాయి.

మొక్కల పెంపకంపై అనిల్ సింగ్ స్థానికులకు అవగాహన కల్పిస్తారు. ఉచితంగా మొక్కలను కూడా పంచుతారు. తన సంపాదనలో కొంత భాగాన్ని పర్యావరణ పరిరక్షణకు ఖర్చుచేస్తారు. పలు ఎన్జీవోలతో కలిసి పర్యావరణ పరిరక్షనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ప్రకృతిలో అంతలా మమేకమయ్యారకు గనకే.. ఆయన్ను గ్రీన్ గురూజీ అని పిలుస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading