Home /News /national /

MINOR GIRL WAS TORTURED BY VILLAGERS WHEN SHE WENT ALONG WITH HER LOVER VRY

Gujarat : ముఖానికి నల్లరంగు పూసి.. గుండు కొట్టించారు.. అక్కడ ప్రేమించడమే. తప్పు....?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat : ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని ఓ బాలికను గ్రామస్థులందరు కలిసి ఆ మైనర్ బాలికకు గుండు కొట్టించి, ఆమె ముఖానికి నల్లరంగు పూసి చిత్రహింసలకు గురి చేశారు.

    ఆధునిక సమాజంలో ప్రేమ పెళ్లిలు ఎంత ఫాస్ట్‌గా కొనసాగుతున్నాయో అంతే ఫాస్ట్‌గా కులాల కుమ్ములాటలు, సంప్రదాయాల ముసుగుల్లో ఆడపిల్లలు నలిగిపోతున్నారు. యువతి యువకులు తమకు నచ్చిన వారిని ప్రేమించడం.. ఆతర్వత పెళ్లి చేసుకునే హక్కు ఉన్నా.. ఎందుకనో చాలా కుటుంబాలు వారి ఆలోచన మాత్రం మారడం లేదు.. దీంతో తమ కుటుంబంలో అమ్మాయిలు ఇతరులను ప్రేమించినట్టు తెలిసినా.. లేదంటే పెళ్లి చేసుకున్నా.. వారిపై దారుణానికి పాల్పడుతున్నారు. ఇంకా కొన్ని తెగల్లో ప్రేమ పెళ్లిళ్లను నిషేధం ఉండడంతో పాటు కులం కట్టుబాట్లతో తీవ్ర చర్యలకు దిగుతున్నారు.

    ఈ క్రమంలోనే ఓ ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలికను చిత్రహింసలకు గురి చేసిన ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. ప్రేమించి వెళ్లిపోవడంతో ఆ బాలికను తీసుకుని వచ్చిన గ్రామస్తులు ఆమెకు గుండుకొట్టించి, ముఖానికి నల్లరంగు పూశారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి వివాహం చేశారు. ఆమె అలా చేయడం వల్ల తమ తెగకు చెడ్డపేరు వచ్చిందని, ఇలా గుండు కొట్టించడం వల్ల శుద్ది జరిగిందని చెబుతున్నారు. అందుకే ఇలా చేశామని చెప్పారు.

    ఇది చదవండి : రిక్షా కార్మికుడికి కోట్ల రూపాయల ఆస్తి దానం.. బంధువులు చుట్టుముట్టినా కాదన్న మహిళ.. కారణం ఇదే.. !


    కాగా ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగినా... ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ సంఘటనలో పాల్గోన్న 35 మందిపై కేసు నమోదు చేశారు. అందులో కొంతమందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు బాలిక మైనర్ కావడంతో బాలికను తీసుకుని వెళ్లిన యువకుడిపై కూడా పోక్సో కేసు నమోదు చేయడం పాటు అత్యాచారం కేసు పెట్టారు.

    గ్యాస్ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు

    ఈశాన్య ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ పేలి 17మందికి గాయాలు అయ్యాయి.. లాల్‌బాగ్ ఏరియాలోని ఓ భవనం మూడో అంతస్తులో పప్పుకుమార్ అనే వ్యక్తి ఖాళీ సిలిండర్‌ను తొలగించి నిండు సిలిండర్‌ను అమరుస్తుండగా మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. 2వ అంతస్తులోని నాలుగు పోర్షన్‌లు కూడా దెబ్బతిన్నాయి.

    స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనలో మొత్తం 17 మంది గాయపడినట్లు గుర్తించి స్థానిక బీజేఆర్ఎం ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Gujarat

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు