తండ్రిని కోటి రూపాయలు డిమాండ్‌ చేసిన బాలిక.. లేకుంటే చంపేస్తానని బెదిరింపులు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

తండ్రిని బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్‌ చేసింది ఓ 12 ఏళ్ల బాలిక. అంతేకాకుండా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది.

 • Share this:
  తండ్రిని బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్‌ చేసింది ఓ 12 ఏళ్ల బాలిక. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. శాలిమార్‌ గార్డెన్‌ ఏరియాకు చెందిన 12 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తె(బాలిక)ను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో కంగుతిన్న ఫిర్యాదుదారుడు.. కూతురిని ప్రశ్నించారు. తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

  ఓ బాలిక తన తండ్రిని బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. లేకపోతే కొడుకు, కూతురుని చంపేస్తానని బెదరింపులకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. షాలిమార్ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని కూతురు(12).. ఘాజియాబాద్‌లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం బాలిక వాట్సాప్ స్టేటస్ చూసిన తల్లిదండ్రులు షాక్ తిన్నారు. అసభ్యకరమైన పదాలు వాడటంతో కూతురిని మందలించారు. అయితే బాలిక తన ఫోన్ హ్యాక్ అయిందని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకున్నారు.

  అయితే సాయంత్రం వేళ.. బాలిక తన తల్లి ఫోన్ టేబుల్ మీద ఉండటం గమనించింది. ఆ ఫోన్ తీసుకుని తన ఫోన్‌లో మాదిరిగానే తల్లి ఫోన్‌లో కూడా అసభ్యకరమైన పదాలతో వాట్సాప్ స్టేటస్ పెట్టింది. అది చూసిన వారి బంధువులు ఫోన్ చేసి.. ఇలా ఎందుకు వాట్సాప్ స్టేటస్ పెట్టావని బాలిక తల్లిదండ్రులను అడిగారు. దీంతో బాలిక తల్లిదండ్రులు మరోసారి షాక్ తిన్నారు. కూతరు చేసిన పనితెలియని.. వారు తాము హ్యాకింగ్ బారినపడ్డామని నమ్మారు. ఇక, జూలై 24న తన తల్లి ఫోన్ తీసుకున్న బాలిక కిడ్నాప్ హెచ్చరికను పోస్ట్ చేసింది. దీంతో బాలిక తండ్రి సహీదాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు ఈ కేసును సైబర్ సెల్‌కు బదిలీ చేవారు. దీంతో సైబర్ నిపుణులు వారి ఫోన్లను పరిశీలించగా.. ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని తేలింది. దీంతో వారి ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. అలాగే ఫోన్స్ ఎవరికి ఇవ్వొద్దని సూచించారు.

  ఆ తర్వాత ఎలాంటి అనుమానస్పద స్టేటస్‌లు కనిపించలేదు. అయితే బుధవారం మాత్రం చంపుతామనే ఓ నోట్ కనిపించింది. కోటి రూాపాయలు ఇవ్వాల్సిందిగా అందులో ఉంది. లేకుండా కొడుకును, కూతురును చంపేస్తామని నోట్‌లో ఉంది. దీంతో భయపడిపోయిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఇంటికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ నోట్ వారి కూతురు రాసినట్టుగా తేలింది. దీంతో ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తల్లిదండ్రులపై కోపంతోనే ఇలా చేసినట్టుగా చెప్పింది. వారు తనను ఫ్రెండ్స్‌ను కలవనివ్వడం లేదని, టీవీ చూడనివ్వడం లేదని, ఫోన్‌లో గేమ్స్ ఆడనివ్వడం లేదని తెలిపింది. అందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్పింది.
  Published by:Sumanth Kanukula
  First published: