హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Youtube Delivery : విచిత్రం.. తల్లిదండ్రులకు తెలియకుండా గర్భం మెయింటెన్ చేసింది. చివరకు యూట్యూబ్ చూస్తూ..

Youtube Delivery : విచిత్రం.. తల్లిదండ్రులకు తెలియకుండా గర్భం మెయింటెన్ చేసింది. చివరకు యూట్యూబ్ చూస్తూ..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Youtube Delivery : ఇంట్లో తెలియకుండా ఓ యవతి అంత్యంత సహాసమే చేసింది. ప్రియుడితో తిరగడంతో పాటు గర్భం వచ్చిన విషయం కూడా తెలియకుండా దాచింది. అంతే కాదు యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

యూట్యూబ్ ( You tube) ద్వారా నేరాలే కాదు.. వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే పరిస్థతి కనిపిస్తుంది. అది కూడా వైద్యురాళ్లు కూడా కావడం గమనార్హం. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా మంచి విషయాలతో పాటు నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి యూట్యూబ్ వీడియో ద్వారా ఏకంగా ప్రసవం కూడా అయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇంట్లోనే ఉన్న మైనర్ బాలిక గర్బం ( Pregnanat ) దాల్చి, ఓ బిడ్డను ప్రసవించిన వరకూ ఆ విషయం తల్లిదండ్రులు గుర్తించలేకపోయిన విచిత్ర ఘటన కేరళలో వెలుగుచూసింది. బాలిక బిడ్డను ప్రసవించిన తర్వాత తల్లి గుర్తించడం గమనార్హం. అంతేకాదు, యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ మైనర్ బాలిక ప్రసవించడం మరో ఆశ్చర్యకర విషయం.

వివరాల్లోకి వెళితే.. కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, అదే గ్రామానికి చెందిన యువకుడు (21) ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఆమె గర్భం దాల్చింది. అయితే యువతి మైనర్ ( Minor girl ) కావడంతో మేజర్ అయిన తర్వాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇంతలో ఆ యువతి గర్బం దాల్చంది. కాగా ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది. కారణం ఆ బాలిక తల్లికి దృష్టిలోపం ఉండగా, సెక్యూరిటీగార్డుగా ( Security gaurd ) పనిచేస్తున్న తండ్రి రాత్రి డ్యూటీలో నిత్యం బయటే ఉంటాడని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి : ఇంట్లో ఒంటరిగా బాలిక.. పక్కింట్లో అదే సమయం కోసం వేచి చూసిన యువకుడు.. చివరకు బాలిక ఇంట్లోకి వెళ్లి..


ఈ క్రమంలోనే తన గర్భాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు ( Parents ) తెలియకుండా జాగ్రత్త పడిన మైనర్ యువతి నెలలు నిండిన తర్వాత ఆసుపత్రికి ( Hospital ) వెళ్లకుండా స్వంత వైద్యం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ గదిలోపల ఉండి యూ ట్యూబ్ వీడియోలు చూస్తూ అక్టోబరు 24న పాపకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తర్వాత బొడ్డు తాడును ఎలా కత్తిరించాలో తెలుసుకోవడానికి తాను యూట్యూబ్ వీడియోలను చూశానని, అప్పుడు కూడా ప్రియుడు ఈ సలహా ఇచ్చాడని బాలిక తెలిపింది... అయితే బిడ్డ పుట్టినా తర్వాత అసలు విషయం బయటపడింది. ప్రసవం అయితే అయింది కాని ఆ పాప ఏడుపుతో ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో అశ్చర్యానికి గురై వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. టీనేజ్ బాలిక గర్భం దాల్చడం గురించి ఆసుపత్రి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించింది. అయితే, కుమార్తె గర్బం దాల్చి బిడ్డను ప్రసవించే వరకూ ఇంట్లోవాళ్లు గుర్తించకపోవడం విస్మయం కలుగుతుందని స్థానికులు వాపోయారు. ఇక మరోవైపు మైనర్ బాలిక గర్భం దాల్చడంతో విషయం తెలిసిన పోలీసులు అందుకు కారణమైన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

First published:

Tags: India news, Kerala, Youtube

ఉత్తమ కథలు