సమయం వృధా కాకుండా, శ్రమ లేకుండా వాహనాల రిజిస్ట్రేషన్(Vehicle Registration), డ్రైవింగ్ లైసెన్స్(Driving License),వెహికల్ పర్మిట్(Vehicle Permit)డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్, (Documents Transfer), వంటి సేవల కోసం ఆర్టీవో(RTO) ఆఫీసులకు వెళ్లే పని లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రోడ్డు, రవాణమంత్రిత్వశాఖ(Road and Transport Ministry) తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కొన్ని లక్షల మందికి ఉపయోగపడనుంది. కేవలం ఇళ్లు, ఆఫీసుల్లో కూర్చొని ఆన్లైన్(Online)లో 58రకాల సేవలను పౌరులే చేసుకునేలా ..ఆర్టీవీ అధికారులపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త నోటిఫికేషన్(Notification)జారీ చేసింది. పలు రకాల సేవలను స్వయంగా పూర్తి చేసుకునేందుకు కేవలం ఆధార్ కార్డు లేదంటే మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్డు ఉంటే సరిపోతుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ వెల్లడించింది.
ఆర్టీవో ఆఫీసులకు వెళ్లే పని లేదు..
దేశంలోని నిత్యం కొన్ని వేలాది మంది డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్ అప్లికేషన్, రీప్లేస్మెంట్, లెర్నర్ లైసెన్స్ అఫ్లికేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు మార్పు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ వంటి సుమారు 58రకాల రోడ్డు, రవాణాశాఖ కార్యాలయాల్లో నిర్వహించే సేవలను ఇకపై ఆన్లైన్లో ఎవరికి వారే స్వయంగా ఇల్లు, ఆఫీసుల దగ్గరే చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది కేంద్ర రోడ్డు, రవాణాశాఖ.
ఆన్లైన్లో 58రకాల సేవలు..
ఈసౌకర్యాలను ఆన్‌లైన్‌కు మార్చడం కారణంగా పౌరులకు టైమ్‌తో పాటు ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పోతుందని భావించింది. అలాగే ఆర్టీవో కార్యాలయాల్లో వాహనదారులు, ఇతర పౌరుల తాకిడి తగ్గుతుందని ఆలోచించి ఈనిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు , రవాణాశాఖ. ఫలితంగా ఆర్టీవో ఆఫీసుల్లో పని సామర్ద్యం పెరుగుతుందని సెంట్రల్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఆన్లైన్ సేవలను కొనసాగిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
టైమ్ సేవ్ ..
నిత్యం కొన్ని లక్షలాది మంది ఆర్టీవో సేవల కోసం చెప్పులు అరిగేలా, డబ్బులు ఖర్చు కాకుండా తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ సేవలను కొనసాగించడానికి ప్రధానంగా ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఒకవేళ ఆదార్ కార్డు అందుబాటులో లేకపోతే ఏధైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును అప్లోడ్ చేయడం ద్వారా ఆన్లైన్ సేవలు కొనసాగించుకోవచ్చని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.