పండుగలకు ఊరెళ్లాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే మరో 392 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 196 రూట్లలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 1 నుంచి దశల వారీగా రైళ్లను ప్రకటిస్తోంది రైల్వే. ఇటీవల 39 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్లు అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ జాబితా కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. ఇక రాబోయేది పండుగ సీజన్ కావడంతో మరో 392 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. అంటే దుర్గాపూజ, దసరా, దీపావళి, ఛాత్ పూజ లాంటి పండుగలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ఈ ట్రైన్స్ ప్రకటించింది.
Gold: బంగారం కొంటున్నారా? ఓ రెండు రోజులు ఆగండి... తక్కువ ధరకే గోల్డ్ మీ సొంతం
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్... నేటి నుంచి కొత్త రిజర్వేషన్ రూల్స్
కొత్తగా ప్రకటించిన 392 రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయో జాబితా కూడా విడుదల చేసింది భారతీయ రైల్వే. అయితే టైమింగ్స్ వివరాలను ఆయా జోన్లు వెల్లడిస్తాయి. అయితే రెగ్యులర్ రైళ్ల టైమింగ్స్ ఈ ప్రత్యేక రైళ్లకు వర్తిస్తాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఈ 392 స్పెషల్ ట్రైన్స్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇవి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ మాత్రమే. నవంబర్ 30 వరకే సేవలు అందిస్తాయి. ఆ తర్వాత ఈ రైళ్లు నడవవని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇక ఇప్పటికే 300 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
Amazon Great Indian Festival Sale: అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
SBI UPI Transfer: యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి
పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. మొదట 39 రైళ్ల జాబితా విడుదలైంది. ఇప్పుడు ఏకంగా 392 రైళ్లను ప్రకటించింది రైల్వే. ఇక అంతకు ముందు మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని ట్రైన్స్, జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ ట్రైన్స్, సెప్టెంబర్ 21 నుంచి మరో 40 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే.
Published by:Santhosh Kumar S
First published:October 14, 2020, 10:53 IST