దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ను హ్యాక్ చేసిన ముష్కరులు అంతటితో ఆగలేదు. క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్ల విషయంలో మోదీ సర్కార్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, హ్యాకర్లు పలు కేంద్ర శాఖల ట్విటర్ ఖాతాలపై వరుస దాడులు చేస్తున్నారు. గతంలో విదేశాంగ శాఖలోని విదేశీ వ్యవహారాల విభాగం ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సమాచార, ప్రసార శాఖ ట్విటర్ అకౌంట్ నూ ఆధీనంలోకి తీసుకున్నారు. వరుస హ్యాక్సింగ్స్.. అందులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలవే జరుగుతున్నా హ్యాకర్లను పట్టుకోవడం ఇప్పటికీ సవాలుగానే ఉంది..
హ్యాకర్స్ అదును చూసి సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలకు సంబంధించిన సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొందరు కేంద్ర మంత్రుల ఖాతాలు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.
సమాచార శాఖ ట్విట్టర్ ఖాతాను తమ చేతిలోకి తీసుకున్న హ్యాకర్లు.. ఖాతా పేరును ఎలాన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రొఫైల్‌లో చేప ఫోటో పెట్టారు.. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేసి.. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు.. అయితే కొద్ది సమయంలోనే ఈ పరిణామాన్ని గమణించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. వెంటనే ఆ ఖాతాను రికవరీ చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
దేశంలో పరిపాలన విధివిధానాలు, పాలసీల రూపకల్పనలో కీలకంగా పనిచేసే నీతి ఆయోగ్ సంస్థలాగే, భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రధాన థింక్ ట్యాంక్ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) సంస్థ అధికారిక ట్విటర్ అకౌంట్ జనవరి తొలి వారంలో హ్యాకింగ్ కు గురైంది. ఐసీడబ్ల్యూఏ ట్విటర్ ను హ్యాక్ చేసిన దుండగులు.. ఆ అకౌంట్ కు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పేరు పెట్టారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికారుల ఫిర్యాదుతో ట్విటర్ సంస్థ వేగంగా స్పందించింది. అంతకు రెండు వారాల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Centre government, Hacking, Twitter