హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం...

రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.11,092 కోట్ల నిధులను విడుదల చేసింది.

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.11,092 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కింద ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్రాల్లో విపత్తుల నిర్వహణ కోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తుంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇది తొలివిడుతగా భావించాలి. అయితే, అందులో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోయినా వాటికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఆ కోటాలో నిధులు అందాయి. 

First published:

Tags: Union Home Ministry

ఉత్తమ కథలు