• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • MINISTRY OF HOME AFFAIRS ANNOUNCES LIST OF MEDAL AWARDEES TO THE POLICE PERSONNEL ON INDEPENDENCEDAY 2020 SK

Independence day: పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్రం.. ఏపీకి, తెలంగాణకు ఎన్నంటే

ప్రతీకాత్మక చిత్రం

Independence day: రాష్ట్రాల వారీగా అవార్డుల వివరాలకు సంబంధించి పూర్తి జాబితాను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. ఏపీకి 16, తెలంగాణకు 14 పతకాలు దక్కాయి.

  • Share this:
    స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్‌లకు కేంద్రహోంశాఖ అవార్డులను అందజేయడం ఆనవాయితీ. ఈసారి కూడా అవార్డులను ప్రదానం చేయనున్నారు. 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్ (PMG), 80ని మంది రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM) , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాల(PM)కు కేంద్రహోంశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, సాయుధ బలగాల వారీగా అవార్డుల వివరాల జాబితాను శుక్రవారం ప్రకటించారు. ఇందులో ఏపీకి 16, తెలంగాణకు 14 పతకాలు దక్కాయి. ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌ను, 14 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకుంటారు.


    అత్యధికంగా యూపీకి చెందిన 102 మంది పోలీసులు రేపు అవార్డులు అందుకుంటారు. ఇక జమ్మూకాశ్మీర్ 94, మహారాష్ట్ర 58, ఝార్ఖండ్ 24, తమిళనాడు 23, పశ్చిమ బెంగాల్ 21, అసోం 21, మధ్యప్రదేశ్ 20, కర్నాటక 19 గుజరాత్ 19, రాజస్థాన్ 18, పంజాబ్ 15, ఛత్తీస్‌గఢ్ 14, ఒడిశా 14, హర్యానా 12, మణిపూర్ 7, కేరళ 6, త్రిపుర 6, ఉత్తరాఖండ్ 4, హిమాచల్ 4, అరుణాచల్ 4, మిజోరాం 3, నాగాలాండ్ 2, సిక్కిం 2, గోవాకు 1 అవార్డు దక్కాయి.

    శనివారం భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటను ఇప్పటికే సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉండడంతో ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: