ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం తీపికబురు అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈపీఎఫ్ పింఛనుదారులకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ ఉండొచ్చని భావిస్తున్నారు. కనీస పెన్షన్‌ను పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.1000 పింఛనును రూ.2000కు పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి నాటికి పెన్షన్ పెంపు నిర్ణయం ప్రటకన ఉండొచ్చనే అనుకుంటున్నారు. ఒకవేళ పింఛన్‌ను డబుల్ చేస్తే కేంద్రంపై సుమారు రూ.2500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. అలాగే, 60 లక్షల మందికి ప్రయోజనం కూడా కలుగుతుంది.
దీపావళి నాటికి ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లోకి...
2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట ఈ వడ్డీని రెండు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించింది. కానీ మొత్తం వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. 6 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లకు దీపావళి నాటికి అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. కాబట్టి ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం అవసరం. వడ్డీ రాకపోతే ఆ తర్వాత ఈపీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO