Home /News /national /

Farmers Protest: రైతుల ఆందోళనకు ఏడు నెలలు పూర్తి.. చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత.. చర్చలకు రావాలని మంత్రి ఆహ్వానం

Farmers Protest: రైతుల ఆందోళనకు ఏడు నెలలు పూర్తి.. చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత.. చర్చలకు రావాలని మంత్రి ఆహ్వానం

రైతుల ఆందోళ(ఫైల్ ఫొటో)

రైతుల ఆందోళ(ఫైల్ ఫొటో)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరు కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో ఏడు నెలలు పూర్తి చేసుకుంది.

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరు కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో ఏడు నెలలు పూర్తి చేసుకుని.. ఎనిమిదో నెలలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా రైతులు చేపట్టిన ర్యాలీ చండీగఢ్-ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తతకు దారి తీసింది. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు.. ట్రాక్టర్లు, ఎండ్ల బండ్ల మీద చండీగఢ్-ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రైతులను నిలువరించేందుకు పోలీసులు.. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఇక, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పలువురు రైతు నాయకులను పోలీసలు అదుపులోకి తీసుకున్నారు.

    రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్.. ఆందోళనలను విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వెంటనే ఆందోళనలు విరమించి.. చర్చలకు రావాలని మీడియా ద్వారా కోరారు. నూతన చట్టాలకు దేశవ్యాప్తంగా చాలా మంది మద్దతు ఇస్తున్నారని, కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చట్టాల్లో ఏ నిబంధనలపై అభ్యంతరాలున్నాయో చర్చల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

    వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హర్యానా, యూపీకి చెందిన రైతులు గతేడాది నవంబర్ 26వ తేదీన ఆందోళన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం- రైతు సంఘాల ప్రతినిధుల మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. చివరిగా జనవరి 22న సాగిన చర్చలు.. ప్రతిష్టంభనతోనే ముగిశాయి. ఇక, జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ దశలో తలెత్తిన హింసాకాండ, ఎర్రకోట వద్ద పరిణామాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చట్టాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ కమిటీ కూడా నివేదికను సమర్పించింది. ప్రస్తుతం రైతుల ఆందోళన యథాతథంగా కొనసాగుతోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు