అతడూ ఉగ్రవాదే.. డీఎస్పీ దవీందర్‌పై సస్పెన్షన్ వేటు

కొంతకాలంగా ఉగ్రవాదులతో దవీందర్ టచ్‌లో ఉన్నాడని.. బాదామిబాగ్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్‌క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని విచారణలో వెల్లడయింది.

news18-telugu
Updated: January 13, 2020, 10:35 PM IST
అతడూ ఉగ్రవాదే.. డీఎస్పీ దవీందర్‌పై సస్పెన్షన్ వేటు
కొంతకాలంగా ఉగ్రవాదులతో దవీందర్ టచ్‌లో ఉన్నాడని.. బాదామిబాగ్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్‌క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని విచారణలో వెల్లడయింది.
  • Share this:
కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇద్దరు టెర్రరిస్టులతో పాటు శనివారం దవీందర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉగ్రవాదులకు సాయం చేసినందుకు గాను అతడిని కూడా ఉగ్రవాదిగానే భావిస్తామని కాశ్మీర్ IGP విజయ్ కుమార్ తెలిపారు. ఇక విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.

కొంతకాలంగా ఉగ్రవాదులతో దవీందర్ టచ్‌లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. బాదామిబాగ్‌ కంటోన్మెంట్‌లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్‌క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని విచారణలో వెల్లడయింది. శనివారంతో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు లాయర్ ఇర్ఫాన్ కూడా డీఎస్పీ ఇంట్లోనే ఉన్నారని తెలిసింది. డీఎస్పీ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన రోజు దవీందర్ సెలవులో ఉన్నాడు. శనివారం నుంచి గురువారం వరకు డ్యూటీకి సెలవులు పెట్టాడు. త్వరలో ఆయనకు ఎస్పీగా ప్రమోషన్ రావాల్సి ఉంది. కానీ అంతలోనే ఉగ్రవాదులతో కలిసి పట్టుబట్టాడు దవీందర్.

శనివారం సాయంత్రం షోపియన్‌లో ఇద్దరు టెర్రరిస్టులతో పాటు కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీ దవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ బాబా, టెర్రరిస్ట్ అల్తాఫ్‌ని బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు డీఎస్పీ డీల్ కుదుర్చుకున్నాడు. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు.

ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు కారులో వెళ్తున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం రావడంతో శనివారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. రోడ్డుపై తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులు కనిపించారు. వారి పక్కనే డీఎస్పీ దవీందర్ సింగ్ కూడా ఉన్నారు. దాంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించారు.


తానేతప్పు చేయలేదని విచారణలో డీఎస్పీ దవీందర్ సింగ్ బుకాయించాడు. పోలీసుల వద్ద లొంగిపోవడం కోసమే టెర్రరిస్టులను తీసుకెళ్తున్నానని.. అంతేతప్ప వారితో చేతులు కలపలేదని దవీందర్ సింగ్ తెలిపాడు. ఐతే ఉగ్రవాదులను ప్రత్యేకంగా విచారించిన అధికారులు.. అసలు వారి మధ్య సరెండర్ గురించి చర్చ జరగలేదని గుర్తించారు. దాంతో ఉగ్రవాదులతో డీఎస్పీకి సంబంధాలు ఉన్నాయని అప్పుడే అంచనాకు వచ్చారు. కొన్ని రోజులుగా డీఎస్పీ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లో అనుమానముంది. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎవరీ దవీందర్.?
శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వద్ద యాంటీ హైజాకింగ్ స్క్వాడ్‌ విభాగంలో దవీందర్ సింగ్ డీఎస్పీగా పనిచేస్తున్నాడు. 2019 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే దవీందర్ స్వచ్చంధంగా జమ్మూకశ్మీర్‌ని స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరాడు. కాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు పనిచేసే ఆ విభాగాన్ని ప్రస్తుతం SOG (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌)గా పిలుస్తున్నారు. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లలోనే బుద్గాం SOGకి హెడ్‌గా ఎదిగారు దవీందర్. ఐతే చాలా రోజుల క్రితమే దవీందర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ పౌరులను హింసిస్తున్నారని 2001లో ఫిర్యాదులు అందాయి. అప్పుడు అరెస్ట్ చేయకుండా కేవలం బదిలీతోనే సరిపెట్టారు. 2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి కేసులోఉరి శిక్షపడిన అఫ్జల్ గురు విచారణ సమయంలోనూ దవీందర్ పేరు బయటకు వచ్చింది.
Published by: Shiva Kumar Addula
First published: January 13, 2020, 10:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading