Indian Army: ఉగ్రవాదిగా మారిన యువకుడు... చంపకుండా కాపాడిన ఇండియన్ ఆర్మీ... వైరల్ వీడియో

యువకుడిని కాపాడిన ఇండియన్ ఆర్మీ... వైరల్ వీడియో (credit - twitter)

Indian Army: ఇండియన్ ఆర్మీపై కొంతమంది లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తుంటారు. తాజా వీడియోతో ఇండియన్ ఆర్మీ తన గొప్పదనాన్ని చాటుకుంది. ఉగ్రవాదిగా మారిన యువకుణ్ని కాపాడింది.

  • Share this:
    Indian Army: అది కాశ్మీర్ లోయలోని... బడ్గామ్ జిల్లా. అక్కడ చిన్నపాటి ఎన్ కౌంటర్ తర్వాత... ఒంటిపై చొక్కాలేని ఓ యువకుడు తుప్పల్లోంచీ బయటకు వచ్చాడు. తనను చంపొద్దని వేడుకున్నాడు. అతన్ని చుట్టుముట్టిన ఇండియన్ ఆర్మీ... జాలి చూపింది. ఆ యువకుడికి తాగడానికి మంచినీరు, వేసుకోవడానికి డ్రెస్ ఇచ్చింది. తాను తప్పుదారిలో వెళ్లాననీ, తనకు ఉగ్రవాదులు తప్పుడు సమాచారం ఇచ్చారనీ ఆ యువకుడు తెలిపాడు. ఇకపై తాను ఉగ్రవాదం లోకి వెళ్లనని వేడుకున్నాడు. ఇండియన్ ఆర్మీ అతన్ని ఏమీ అనలేదు. మంచి కెరీర్ డెవలప్ చేసుకో అంటూ... అతన్ని తన తండ్రికి అప్పగించింది. రెండ్రోజుల కిందటే ఇంట్లోంచీ వెళ్లిపోయిన తన కొడుకు తిరిగి తన దగ్గరకు రావడంతో... ఆ తండ్రి ఎంతో ఆనందించాడు. తన కొడుకు ఉగ్రవాదంలోకి వెళ్లాడన్న విషయం తనకు తెలియదన్న ఆ తండ్రి... ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    నిజానికి ఆ ఎన్ కౌంటర్లో... సైన్యం తుప్పల్లోకి కాల్పులు జరిపి ఉంటే... ఆ యువకుడు చనిపోయేవాడే... కానీ సైన్యం చాకచక్యంగా వ్యవహరించింది. ఆ యువకుడు సైనికులపై కాల్పులు జరిపినా... సైన్యం రివర్స్ కాల్పులు జరపలేదు. "మా వాళ్లు చుట్టూ ఉన్నారు. నువ్వు బయటకు రాకపోతే... కాల్పులు జరుపుతాం" అని చెప్పడంతో... ఆ యువకుడు బయటకు వచ్చి తనను చంపొద్దని వేడుకున్నాడు. యువకుడి నుంచి ఓ ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

    జమ్మూకాశ్మీర్ లో ఎంతో మంది యువకుల్ని ఇలాగే ఉగ్రవాదులు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులపై లేనిపోని అసత్యాలు చెప్పి... ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. పేదరికం కారణంగా చాలా మంది యువకులు... ఉగ్రవాదంవైపు మళ్లుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా... జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వంతెనలు, ప్రాజెక్టులూ నిర్మిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతలా ప్రయత్నిస్తున్నా... అప్పుడప్పుడూ ఇలా కొంత మంది ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. తీరా ఉగ్రవాద శిబిరాలకు వెళ్లాక... తమ తప్పును తెలుసుకుంటున్నారు.


    ఈ వీడియో చూసైనా... ఉగ్రవాదం వైపు మళ్లాలనుకునే యువకులు పునరాలోచించుకుంటారని సైన్యం ఈ వీడియోను షేర్ చేసింది. దీనిపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ ఆర్మీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


    చైనాతో చేతులు కలిపిన పాకిస్థాన్ పాలకులు... భారత దేశ నాశనం కోసం పనిచేస్తున్న ఉగ్రవాదులతు తమ దేశంలో స్థావరం కల్పిస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదులకే మద్దతిస్తోంది. ఫలితంగా మన దేశంలో యువతను దారిమళ్లించేందుకు టెర్రరిస్టులు కుట్రలు పన్నుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: