Home /News /national /

MIGRANT LABOURERS WERE CRUSHED TO DEATH BY A GOODS TRAIN NEARLY TEN MONTHS BEFORE AND THEIR FAMILIES ARE STILL WAITING TO GET THEIR DEATH CERTIFICATES SSR

Migrant Labourers: గూడ్స్ రైలు కింద నలిగిన వలస కార్మికుల ఘటన గుర్తుందా.. ఇప్పుడెందుకంటే..

కార్మికుల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు

కార్మికుల మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి రైలు పట్టాల వెంబడి నడక సాగించారు. నడిచి నడిచి అలసిపోయి.. రాత్రి పట్టాలపై సేద తీరిన వారిపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు ప్రాణాలు...

ఇంకా చదవండి ...
    భోపాల్: మన దేశంలో ఎక్కడైనా ఘోర ప్రమాదాలు, ఉపద్రవాలు కలిగి ప్రాణ నష్టం వాటిల్లినప్పుడు బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంటాయి. ఈ ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాల చేతికందించే విషయంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డెత్ సర్టిఫికెట్ ఉంటే తప్ప ఎక్స్‌గ్రేషియా గానీ, ఆ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ గానీ బ్యాంకులో మార్చుకునేందుకు వీలుండదు. ఆ డెత్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం పొందడం గగనంగా మారుతోంది. సరిగ్గా 10 నెలల క్రితం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో రైలు పట్టాలపై నిద్రిస్తున్న 16 మందిపై గూడ్స్ రైలు వెళ్లిన ఘటన గుర్తుండే ఉంటుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి రైలు పట్టాల వెంబడి నడక సాగించారు. నడిచి నడిచి అలసిపోయి.. రాత్రి పట్టాలపై సేద తీరిన వారిపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని కేంద్రం, శివసేన ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

    మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మధ్య‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. కానీ.. ఆ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ ఆ సాయం అందలేదు. చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రాలు ఉంటేనే సాయం పొందేందుకు వీలుంటుందని అధికారులు తేల్చి చెప్పారు. కానీ.. ఏ ఒక్క బాధిత కుటుంబానికి డెత్ సర్టిఫికెట్ అందలేదు. ఆ డెత్ సర్టిఫికెట్స్ కోసం ఆ బాధిత కుటుంబాలు నిరీక్షిస్తూనే ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్స్ రాకపోవడంతో ఆ కుటుంబాలకు ప్రభుత్వ పథకాల విషయంలో గానీ, బ్యాంకుల్లో ముఖ్యమైన పనులు గానీ ముందుకు సాగడం లేదు. చనిపోయిన వారిలో 11 మంది షాదోల్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఆ బాధిత కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్స్ అందకపోవడంపై షాదోల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు చనిపోయిన వారికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాలను పంపాలని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులకు ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపింది.

    బాధిత కుటుంబాలు డెత్ సర్టిఫికెట్ కోసం జైసింగ్ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ ముందు దరఖాస్తు చేసుకోగా.. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి అధికారులే డెత్ సర్టిఫికెట్ ఇస్తారన్న సమాధానమొచ్చింది. బాధిత కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన మహిళ స్పందిస్తూ.. తన భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో వితంతు ఫించన్ కూడా అందడం లేదని వాపోయింది. కేవలం ఫించన్‌కే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాలకు, ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని ఆమె చెప్పింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Lockdown, Madya pradesh, Maharashtra, Migrant Workers

    తదుపరి వార్తలు