దక్షిణ బెంగళూరుకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్... ప్రధాని మోదీ దక్షిణ బెంగళూరుకు పోటీ చేస్తారా?

Lok Sabha Elections 2019 : దక్షిణ రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో... దక్షిణ బెంగళూరుకు అభ్యర్థి లేకపోవడం వెనక కారణం మోదీయేనా?

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 7:14 PM IST
దక్షిణ బెంగళూరుకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్... ప్రధాని మోదీ దక్షిణ బెంగళూరుకు పోటీ చేస్తారా?
నరేంద్ర మోదీ (File)
  • Share this:
ఆలస్యంగానైనా కాంగ్రెస్... కర్ణాటకలో తాను పోటీ చేయబోయే 20 లోక్‌ సభ స్థానాల్లో 18 సీట్లకు అభ్యర్థుల జాబితాను అర్థరాత్రి ప్రకటించింది. మిగతా 8 లోక్ సభ స్థానాల్లో మిత్రపక్షం జేడీఎస్ పోటీ చెయ్యబోతోంది. ఆశ్చర్యకర విషయమేంటంటే... దక్షిణ బెంగళూరు, ధార్వాడ్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ధార్వాడ్ ఎన్నికలు ఏప్రిల్ 23న మూడో దశలో జరగనున్నాయి. అందువల్ల అక్కడ అభ్యర్థిని ప్రకటించేందుకు చాలా టైమ్ ఉంది. కానీ, దక్షిణ బెంగళూరుకు రెండో దశలో ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ వేసేందుకు చివరి తేదీ మార్చి 26. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు సౌత్ నుంచీ పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. 1991 నుంచీ ఈ స్థానంలో ప్రతిసారీ బీజేపీయే గెలుస్తూ వస్తోంది. అందువల్ల కాంగ్రెస్ ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేముందు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ బెంగళూరు... కాంగ్రెస్‌కి కలిసిరాని స్థానమనే చెప్పాలి. 1977 నుంచీ అక్కడ కాంగ్రెసేతర అభ్యర్థే గెలుస్తున్నారు. ఒక్క 1989లో మాత్రమే కాంగ్రెస్ ఆ స్థానాన్ని దక్కించుకోగలిగింది. ఆ తర్వాత రెండేళ్లకే దాన్ని బీజేపీకి సమర్పించుకుంది. 1991లో తొలిసారిగా బీజేపీ బోణీ కొట్టింది. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్.కె.వెంకటగిరి గౌడ... బీజేపీ తరపున ఇక్కడ అకౌంట్ తెరిచారు.


1996 నుంచీ గత నవంబర్ వరకూ... ఆరుసార్లు ఇక్కడ కేంద్ర మంత్రి అనంతకుమార్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఆయన చనిపోయేవరకూ ఈ స్థానం బీజేపీతోనే ఉంది. ఆయన భార్య తేజశ్విని ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారామె. మరి అక్కడి నంచీ మోదీ పోటీ చేస్తారా లేదా అన్నదానిపై కర్ణాటక బీజేపీ నేతలు తమకు ఎలాంటి సమాచారమూ లేదంటున్నారు.

సిటీ పోలీసులు మాత్రం... సోమవారం సెక్యూరిటీని పెంచాల్సిందిగా తమకు ఆదేశాలొచ్చాయని చెబుతున్నారు. ఎవరో బిగ్ షాట్... సోమవారం బెంగళూరు వచ్చి, నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. మోదీ గనక దక్షిణ బెంగళూరు నుంచీ పోటీ చేస్తే, తాము బలమైన అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటించింది. మోదీ గనక సౌత్ నుంచీ పోటీ చేస్తే... దక్షిణాన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడం గ్యారెంటీ. 

ఇవి కూడా చదవండి :

దక్షిణాదిపై జాతీయ పార్టీల చూపు... సీట్లు పెంచుకోవడమే లక్ష్యం... అధినేతలు సౌత్‌లో పోటీ చేస్తారాసైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
First published: March 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు