MID AIR PANIC INSIDE SPICEJET PLANE AMID TURBULENCE 14 WERE HURT PVN
SpiceJet : గాల్లో భారీ కుదుపులకు గురైన విమానం..ప్రయాణికులకు గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
Mid air panic inside SpiceJet : మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ వెళ్తున్న స్పైస్‌జెట్(Spicejet)విమాన ప్రయాణికులు ఆదివారం కొద్దిసేపు ప్రత్యక్ష నరకం చూశారు.
Mid air panic inside SpiceJet : మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ వెళ్తున్న స్పైస్‌జెట్(Spicejet)విమాన ప్రయాణికులు ఆదివారం కొద్దిసేపు ప్రత్యక్ష నరకం చూశారు. స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి737 విమానం వాతావరణ మార్పుల కారణంగా గాలిలో ఒక్క సారిగా కుదుపులకు గురైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో విమనంలోని ప్రయాణికులందరూ భయంతో వణికిపోయారు. ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ప్రయాణికులపై లగేజీ కూడా పడింది.
ఈ ఘటనలో దాదాపు 14 మందికి గాయాలైనట్లు సమాచారం. అయితే వారి ప్రాణాలకు వచ్చే ముప్పు లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. విమానం దుర్గాపూర్‌కు చేరుకొని, ల్యాండ్ అయ్యే సమయానికి ముందు ఈ కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పైస్‌జెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడినవారిని హాస్పిటల్ కి తరలించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇంత భారీ కుదుపులకు కారణాలేంటని అధికారులు విచారణ చేయనున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.