మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ భేటీ...
ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మూడు రోజులు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
news18-telugu
Updated: November 18, 2019, 8:04 PM IST

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ భేటీ
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 8:04 PM IST
గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మూడు రోజులు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రానున్న దశాబ్దంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని బిల్ గేట్స్ అన్నారు. అనూహ్య వృద్ధి రేటు నమోదవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో గత పదేళ్లుగా గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ప్రధాని మోదీతో చర్చించారు. ముఖ్యంగా వైద్య రంగంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పలు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు గేట్స్ ఫౌండేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
Loading...