ప్రధాని మోదీకి షాక్... పౌరసత్వ చట్టంపై సత్య నాదెళ్ల అభ్యంతరాలు...

సత్యనాదెళ్ల

ప్రజాస్వామ్య దేశాల్లో... పౌరసత్వం వంటి అంశాలపై ప్రజలు, ప్రభుత్వాల మధ్య డిబేట్లు జరుగుతాయనీ, అందరూ కలిసి ఆయా పరిధులకు లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సత్యనాదెళ్ల అన్నారు.

 • Share this:
  ప్రపంచ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో, ఇండియన్ సత్యనాదెళ్ల... కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జరిగింది బాధాకరమన్న ఆయన... ఓ బంగ్లాదేశీ శరణార్థి... ఇండియాలో నెక్ట్స్ యూనీకార్న్ ప్రారంభిస్తే లేదంటే... ఇన్ఫోసిస్ నెక్ట్స్ CEO అయితే... తాను ఆనందపడతానని అన్నారు. మాన్‌హట్టన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఇండియాలో ప్రస్తుత పరిస్థితులపై ఎడిటర్స్ అభిప్రాయం అడిగినప్పుడు సత్యనాదెళ్ల ఇలాంటి కామెంట్స్ చేశారు. ప్రతీ దేశం తన సరిహద్దులను ఫిక్స్ చెయ్యాలన్న సత్య నాదెళ్ల... జాతీయ భద్రతను కాపాడుతూ అందుకు తగిన విధంగా శరణార్థుల పాలసీని రూపొందించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో... ఇలాంటి అంశాలపై ప్రజలు, ప్రభుత్వాల మధ్య డిబేట్లు జరుగుతాయనీ, అందరూ కలిసి ఆయా పరిధులకు లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇండియాలో పుట్టి... వేర్వేరు సంస్కృతులను చూసి... అమెరికాకు శరణార్థిలా వెళ్లిన తాను... ఇండియాకి వెళ్లే శరణార్థులు... అభివృద్ధి చెందే స్టార్టప్‌లు ప్రారంభించాలనీ, భారత ఆర్థిక వ్యవస్థ, సొసైటీకి ప్రయోజనం కలిగేలా మల్టీనేషనల్ కార్పొరేషన్‌ను ముందుకు నడిపించాలని అన్నారు.

  నాదెళ్ల వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ ట్విట్టర్‌లో స్పందించారు. అక్షరాస్యులు... విద్యావంతులుగా అవ్వాలన్న ఆమె... అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ CAA అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లో అల్పసంఖ్యాక (మైనార్టీ) వర్గాలకు CAA ద్వారా చక్కటి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అమెరికాలో యెజిదిస్ బదులు... సిరియా ముస్లింలకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే ఎలా ఉంటుంది అని ఆమె సత్యనాదెళ్లను ప్రశ్నించారు.


  జనవరి 10 నుంచీ ఇండియాలో పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌లో మత వేధింపులు ఎదుర్కొని... భారత్ వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్‌లో 19 మంది చనిపోయారు.
  Published by:Krishna Kumar N
  First published: