హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

MIB - BARC: న్యూస్ రేటింగ్స్ మార్చొద్దు... బార్క్‌కు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆదేశం

MIB - BARC: న్యూస్ రేటింగ్స్ మార్చొద్దు... బార్క్‌కు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆదేశం

MIB - BARC: న్యూస్ రేటింగ్స్ మార్చొద్దు... బార్క్‌కు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆదేశం (ప్రతీకాత్మక చిత్రం)

MIB - BARC: న్యూస్ రేటింగ్స్ మార్చొద్దు... బార్క్‌కు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆదేశం (ప్రతీకాత్మక చిత్రం)

MIB - BARC: న్యూస్ రేటింగ్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయా... తెరవెనక ఏమవుతోంది... కేంద్ర సమాచార ప్రసార శాఖ రేటింగ్స్ మార్చొద్దని బార్క్‌ని ఎందుకు ఆదేశించింది?

  MIB - BARC: మీరు తరచూ వినే ఉంటారు... టీవీ రేటింగ్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయి అనే ఆరోపణల్ని. తాజాగా మరోసారి ఈ దుమారం రేగింది. దీంతో మధ్యలో ఎంటరైన కేంద్ర సమాచార ప్రసార సాఖ (MIB)... టీవీ రేటింగ్స్‌లో మార్పులేవీ చెయ్యకుండా... యాథాతథ స్థితి (“status quo”) కొనసాగించమని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ని ఆదేశించింది. కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన తర్వాతే... రేటింగ్స్ సంగతి తేల్చుతామని MIB చెప్పింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ లేఖను బార్క్‌కి పంపింది. "మీకు తెలిసే ఉంటుంది. 2020 నవంబర్ 4న కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి అధ్యక్షుడిగా ప్రసార భరతి సీఈఓ శశి శేఖర్ వెంపటి ఉన్నారు. ఇప్పుడు ఉన్న TRP రేటింగ్ విధానంలో లోపాలను అధ్యయనం చేసి... మరింత సమర్థమైన మార్పులు, సూచనలతో కమిటీ తరపున ఓ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాం. అత్యంత నమ్మకమైన, పారదర్శకమైన రేటింగ్ విధానాన్ని సూచంచమని చెప్పాం. ఆ ప్రకారమే రిపోర్టు ఇచ్చారు. దాన్ని పరిశీలించాల్సి ఉంది. అందువల్ల అప్పటివరకూ రేటింగ్స్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి" అని లేఖలో తెలిపింది.

  ఈమధ్య న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (NBF)... (ఇందులో స్థానిక, ప్రాంతీయ, జాతీయ ఛానెళ్లు ఉంటాయి)... కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి... ఈ రేటింగ్స్ విషయంలో జోక్యం చేసుకోవాలనీ... డేటాని పరిశీలించాలని కోరింది. అలా కోరిన కొన్ని రోజులకే బార్క్‌కి ఆదేశం వెళ్లింది. బార్క్‌లో ఎలాంటి మార్పులు తెస్తామన్నా తమకు అభ్యంతరం లేదన్న NBF... పూర్తిగా రేటింగ్స్ అనే విధానమే లేకుండా మాత్రం చేయవద్దని కోరింది. అలా చేస్తే... న్యూస్ ఛానెళ్ల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసినట్లు అవుతుందని విన్నవించింది.

  "మేమంతా బార్క్‌లో వాటాదారులం. డేటాను లెక్కలు వేసి చెప్పడం అనేది మా ప్రసార పరిశ్రమకు కీలకం. ఐతే... ఇందులో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. ఐతే... పూర్తిగా వ్యవస్థను మూసేయడం పరిష్కారం కాదు. డేటా ప్రసారం కొనసాగుతూ ఉంటే... మెరుగదల అదే వస్తుంది. కాలక్రమంగా జరిగే మెరుగుదల ఇది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాం" అని NBF... MIBని కోరింది.

  కరెన్సీ లేకపోతే... చిన్న ఛానెళ్లు తీవ్రమైన నష్టాలు చూస్తాయని NBF తెలిపింది. "కరెన్సీ లేకపోతే... మమ్మల్ని మేము ఎలా సేల్ చేసుకుంటాం. అసలు న్యూస్ జన్రే (genre) డేటాను మాత్రమే ఎందుకు ఆపాలి. చాలా యాడ్ బ్రాండ్స్... న్యూస్ ఛానెళ్లవైపు చూడటం మానేశాయి. ఎందుకంటే న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్ లేవు. అందువల్ల అవి ఆకర్షితులు కావట్లేదు." అని NBFతో సంబంధం ఉన్న ఓ సీనియర్ సభ్యుడు తెలిపారు.

  ఇది కూడా చదవండి: Nature World: ప్రకృతిలో జీవిస్తున్న 10 కమ్యూనిటీలు... ఏమి హాయిలే అలా...

  మరోవైపు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (NBA)... (ఇందులో అన్ని ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెళ్లు ఉంటాయి)... బార్క్‌కి ఓ లేఖ రాసింది. రేటింగ్స్ డేటా రిలీజ్ చెయ్యాలని ఎలాంటి డిమాండూ చెయ్యలేదు. కానీ... ఈ ప్రక్రియను ప్రక్షాళన (‘cleansing processes’) చెయ్యాలని కోరింది. అటు బార్క్‌కి లేఖ రాసిన NBA... గత మూడు నెలలుగా రేటింగ్స్‌ని ప్రక్షాళన చేసేందుకు ఏయే చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: National News

  ఉత్తమ కథలు