సోనియా ఫ్యామిలీకి షాక్.. ఆ ట్రస్ట్‌లపై విచారణకు ప్రత్యేక కమిటీ

చైనాతో రాహుల్ గాంధీ ఫౌండేషన్‌కు సంబంధాలున్నాయని.. చైనా ఎంబసీ నుంచి ఆ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ సంబంధాల వల్ల కాంగ్రెస్ అగ్రనేతలు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: July 8, 2020, 11:42 AM IST
సోనియా ఫ్యామిలీకి షాక్.. ఆ ట్రస్ట్‌లపై విచారణకు ప్రత్యేక కమిటీ
సోనిియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా
  • Share this:
గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. గాంధీ ఫ్యామిలీకి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లు ఐటీశాఖ చట్టం, PMLA, FCRA వంటి చట్టాలను ఉల్లఘించాయని ఆరోపణలున్నాయి. వాటికి చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని బీజేపీ నేతలు సైతం ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయా ట్రస్ట్‌ల అక్రమ లావాదేవీలపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని కేంద్రహోంశాఖ నియమించింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ డైరెక్టర్‌కు నేతృత్వం వహిస్తారు.

భారత్, చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని.. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని సోనియా, రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మన భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటన చేసినప్పటికీ.. పదే పదే ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేశారు. చైనాతో రాహుల్ గాంధీ ఫౌండేషన్‌కు సంబంధాలున్నాయని.. చైనా ఎంబసీ నుంచి ఆ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఇటీవల రూ.90 లక్షల మేర నిధులు వచ్చాయని తెలిపారు. ఈ సంబంధాల వల్ల కాంగ్రెస్ అగ్రనేతలు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించడం చర్చనీయాంశమైంది.

Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading