
అమిత్ షా (File Photo)
మన దేశంలో ఆశ్రయం పొందేందుకు వచ్చిన శరణార్థుల్లో కొందరు చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నారని, వారి సౌకర్యం కోసం పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం ఉద్దేశించింది అని, తద్వారా సమాన అవకాశాలు కలుగుతాయని పేర్కొంది.
పౌరసత్వ సవరణ చట్టం కేవలం భారతీయులను ఉద్దేశించినది కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ చట్టం ఏ మతాన్ని టార్గెట్ చేస్తూ రూపొందించింది కాదని తెలిపింది. ముఖ్యంగా మన దేశంలో ఆశ్రయం పొందేందుకు వచ్చిన శరణార్థుల్లో కొందరు చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నారని, వారి సౌకర్యం కోసం పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం ఉద్దేశించింది అని, తద్వారా సమాన అవకాశాలు కలుగుతాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టంలోని నిబంధనలను అమలు చేస్తుందని, తద్వారా ఏ ఒక్క శరణార్థికి కూడా వెంటనే పౌరసత్వం లభించదని, అందుకోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపింది. సీఏఏ చట్టం రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ క్రింద ఉన్న ప్రాంతాలను మరియు ఇన్నర్ లైన్ పర్మిట్ వ్యవస్థ పరిధిలో ఉన్న ప్రాంతాలను మినహాయించడం ద్వారా ఈశాన్య ప్రాంతంలోని గిరిజనులు మరియు స్థానిక ప్రజల ప్రయోజనాలను రక్షిస్తుంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వలసదారులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేరని తెలిపింది. అలాగే సీఏఏ చట్టం కటాఫ్ తేదీ డిసెంబర్ 31, 2014గా నిర్ణయించారు. అంతకన్నా ముందు నుంచి నివాసం ఉంటున్న శరణార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులుగా పేర్కొంది.
Published by:Krishna Adithya
First published:December 16, 2019, 21:35 IST