METRO RAIL BIRTHDAY AND PRE WEDDING PARTIES ON METRO COACHES YOU CAN ALSO BOOK
మెట్రో కోచ్‌లో బర్త్‌డే, ప్రీ-వెడ్డింగ్ పార్టీలు..గంటకు కేవలం రూ.5 వేలు
Metro Jobs: నోయిడా మెట్రోలో 199 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
ఆదాయాన్ని పెంచుకునేందుకు నోయిడా మెట్రో వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై మెట్రో కోచ్‌లను బర్త్‌డే పార్టీలు, ప్రీ-వెట్టింగ్ పార్టీలు, ఇతర పార్టీల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఆదాయాన్ని పెంచుకునేందుకు నోయిడా మెట్రో వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై మెట్రో కోచ్‌లను బర్త్‌డే పార్టీలు, ప్రీ-వెట్టింగ్ పార్టీలు, ఇతర పార్టీల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న వారు గంటకు లైసెన్స్ ఫీజు కింద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. డెకరేషన్ చేసిన కోచ్‌కి రూ.10 వేలు, డెకరేషన్ చేయకుండా రూ.5 వేలు గంటకు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. మెట్రో రైలు ఆపరేషన్‌లో ఉన్నప్పుడు, ఆపరేషన్‌లో లేనప్పుడు రెండు సందర్భాల్లోనూ పార్టీలకు అద్దెకు ఇస్తారు. అంటే మెట్రో రైలు నడుస్తున్నప్పుడు అందులోని ఓ కోచ్‌లో పార్టీలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు..లేదా మెట్రో రైలు ఆగి ఉన్నప్పుడు పార్టీలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. బుక్ చేసుకున్న తర్వాత ఒక కోచ్‌లోకి గరిష్టంగా 50 మందిని మాత్రమే అనుమతిస్తామని నోయిడా మెట్రోరైల్ కార్పొరేషన్(ఎన్ఎంఆర్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కువ మందికి కావాలంటే మరో కోచ్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు కేటగిరీల్లో ఛార్జీలు ఉంటాయి.
ఛార్జీల వివరాలు ఇలా ఉంటాయి
1.డెకరేషన్ లేకుండా మెట్రో నడుస్తున్నప్పుడు...రూ.8 వేలు
2.డెకరేషన్ లేకుండా మెట్రో ఆగి ఉన్నప్పుడు...రూ.5 వేలు
3.డెకరేషన్ చేసి మెట్రో నడుస్తున్నప్పుడు...రూ.10వేలు
4.డెకరేషన్ చేసి మెట్రో ఆగి ఉన్నప్పుడు...రూ.7 వేలు
ప్రతీకాత్మక చిత్రం
కోచ్ బుకింగ్‌కు సూచనలు...
1.పార్టీల కోసం మెట్రో కోచ్‌ను అద్దెకు తీసుకోవాలంటే 15 రోజులకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2.మెట్రో కోచ్‌ను బుక్ చేసేందుకు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
3.ఒకే రైలులో గరిష్ఠంగా నాలుగు కోచ్‌లను బుక్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
పార్టీల కోసం కోచ్లోె కల్పించే ప్రత్యేక వసతులు
1. సెంటర్ టేబుల్ ఏర్పాటు చేస్తారు.
2.ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తారు
3. కోచ్‌లో ఒక హౌస్‌కీపింగ్ సహాయకుడిని నియమిస్తారు
మరికొన్ని మెట్రోల్లోనూ ఇలా పార్టీల కోసం మెట్రో కోచ్‌లను బుక్ చేసుకునే వసతిని కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలోనూ ఇలాంటి వెసులుబాటు కల్పిస్తారేమో వేచిచూడాల్సిందే.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.