కోలీవుడ్‌లో #MeToo రగడ...చిన్మయికి వైరముత్తు సవాల్

తాను సచ్ఛీలుడో? కాదో? ఇప్పుడే ఎవరూ నిర్ణయించాల్సిన అవసరం లేదని, కోర్టే నిర్ణయిస్తుందని వైరముత్తు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: October 14, 2018, 11:19 PM IST
కోలీవుడ్‌లో #MeToo రగడ...చిన్మయికి వైరముత్తు సవాల్
తమిళ రచయిత వైరముత్తు
  • Share this:
‘మీ టీ’(#MeToo) ఉద్యమం ఇప్పుడు కోలీవుడ్‌ను కూడా కుదిపేస్తోంది. తమిళ రచయిత వైరముత్తు తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు గాయిని చిన్మయి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన వైరముత్తు...తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవమని స్పష్టంచేశారు. దురుద్దేశపూర్వకంగా తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు తమ ఆరోపణలు వాస్తవమని భావిస్తే...తనపై కేసు పెట్టొచ్చని సలహా ఇచ్చారు. కేసు పెడితే ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు.

వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి
వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి


తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలకు సంబంధించి గత వారం రోజులుగా సీనియర్ న్యాయవాదులు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు చెప్పారు. తనపై మోపిన అభియోగాలు అవాస్తవాలని నిరూపించేందుకు అవసరమైన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు. తాను సచ్ఛీలుడో? కాదో? ఇప్పుడే ఎవరూ నిర్ణయించాల్సిన అవసరం లేదని, కోర్టే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.

Published by: Janardhan V
First published: October 14, 2018, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading