#MeToo: మీటూ ఎఫెక్ట్‌తో మరో నాలుగు వికెట్లు డౌన్

కంపెనీ వ్యవస్థాపకుల మీద జర్నలిస్ట్ సంధ్య మీనన్ ‘మీటూ’ ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: October 18, 2018, 5:31 PM IST
#MeToo: మీటూ ఎఫెక్ట్‌తో మరో నాలుగు వికెట్లు డౌన్
మీటూ వివాదంపై న్యూస్‌18 క్రియేటివ్
  • Share this:
దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా చేయగా, వివిధ రంగాల్లో ప్రముఖులు తమ సినిమాల నుంచి తప్పుకొన్నారు. కొన్ని సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగుల మీద ఆయా కంపెనీలు వేటు వేశాయి. తాజాగా ఈ లిస్టులో మరో నలుగురు చేశారు. హ్యాపీ క్రియేటివ్ సంస్థ సీఈఓ, ఎండీ, మరో ఇద్దరు సీనియర్ అధికారులు సంస్థ నుంచి తప్పుకొన్నారు.

హ్యాపీ క్రియేటివ్ సంస్థ సీఈఓ కార్తీక్ అయ్యర్, ఎండీ ప్రవీణ్ దాస్, సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ బోధిసత్వ దాస్ గుప్తా, నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దినేష్ స్వామి తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. డెంట్సీ ఏజిస్ నెట్‌వర్క్ అనే సంస్థకు చెందినదే ఈ హ్యీపీ క్రియేటివ్ సంస్థ. ఆ కంపెనీ వ్యవస్థాపకుల మీద జర్నలిస్ట్ సంధ్య మీనన్ ‘మీటూ’ ఆరోపణలు చేశారు. ఈనెల 10న ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రాగిణి కమరన్ అయ్యర్ అనే మహిళ.. హ్యాపీ ఫౌండర్స్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఓ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు.


కంపెనీ వ్యవస్థాపకుల మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆ సంస్థ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తమ సంస్థలో మహిళలకు భద్రత కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. పని ప్రదేశాల్లో ఇలాంటి లైంగిక వేధింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 18, 2018, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading