#MeToo: దిల్లీ చేరుకున్న కేంద్ర మంత్రి ఎంకే అక్బర్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంకే అక్బర్‌ను కేంద్ర కేబినెట్‌లో కొనసాగించాలా? వద్దా? అనే విషయమై మోదీ సర్కారు ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 14, 2018, 9:47 AM IST
#MeToo: దిల్లీ చేరుకున్న కేంద్ర మంత్రి ఎంకే అక్బర్
ఎంజే అక్బర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ విదేశీ పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్నారు. మీ టూ ఉద్యమంలో భాగంగా గత కొన్ని రోజులుగా పలువురు మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పదవికి  రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో ఎంకే అక్బర్‌ను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై మోదీ సర్కారు ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో ఎంకే అక్బర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు. పలువురు మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనపై ఆరోపణలు చేసిన వారిలో  గతంలో ఆయన పత్రికా సంపాదకుడిగా పనిచేసిన సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన మహిళా జర్నలిస్టులు ఉన్నారు. సెప్టెంబర్ 8న ప్రియా రమణి అనే జర్నలిస్ట్ తొలుత అక్బర్‌పై సంచలన ఆరోపణలు చేయగా...ఆ తర్వాత పలువురు ఆమెతో గళం కలిపారు.

దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన..మీటూ ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు. దీనిపై ఆ తర్వాత ప్రకటన చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎంకే అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఇది వరకే సహచర కేంద్ర మంత్రి మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అటు మరో మహిళా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. తమ బాధను బహిరంగ పర్చిన వారిపై కక్ష సాధింపు చర్యలు ఉండరాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సదరు మంత్రి వివరణ ఇవ్వాలని సూచించారు.

లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంకే అక్బర్‌ను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు డిమాండ్ చేశాయి.
Published by: Janardhan V
First published: October 14, 2018, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading