రైతులకు తీపి కబురు...ఈ ఏడాది పంటలే పంటలు..

news18-telugu
Updated: April 15, 2019, 4:13 PM IST
రైతులకు తీపి కబురు...ఈ ఏడాది పంటలే పంటలు..
news18-telugu
Updated: April 15, 2019, 4:13 PM IST
దేశ రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేసింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని..పంటలు సమృద్ధిగా పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ ‌వర్షపాతం‌‌ నమోదవుతుందని పేర్కొంది. దీర్ఘకాలికంగా దేశంలో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలినినో ప్రభావం బలహీనంగా ఉండటంతో వర్షపాతంపై ప్రభావం ఉండే అవకాశముందని.. జూన్ మొదటి వారంలో వర్షపాతంపై రెండవ విడత అంచనాలను విడుదల చేస్తామని వెల్లడించారు.

మే మాసం రాగానే రైతులంతా వ్యవసాయంపై దృష్టిపెడతారు. దుక్కి దున్నడం మొదలుకొని..విత్తనాలు, ఎరువుల గురించి ఆలోచిస్తుంటారు. వర్షాలు ఎలా పడతాయి? ఎలాంటి పంటలు వేయాలి? అనే అంశాల గురించి చర్చించుకుంటారు. ఈ క్రమంలో రైతులకు వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. వర్షపాతం సాధారణంగా ఉంటుందని.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముంది.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...