హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం...మత్స్యకారులకు హెచ్చరిక జారీ..

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం...మత్స్యకారులకు హెచ్చరిక జారీ..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

8, 9 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొన్న కారణంగా దీని ప్రభావంతో ఒడిసా, పశ్చిమబెంగాల్‌ తీరాలకు దగ్గరలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు ఒంపు తిరిగింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు నుంచి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరంలో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. సోమవారం ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

  8, 9 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Heavy Rains, WEATHER

  ఉత్తమ కథలు