కొన్ని రోజులుగా మన దేశంలోని గగనతలంలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో మహాారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆకాశం నుంచి మండుతున్న వస్తువులు భూమి వైపు దూసుకొచ్చాయి.ఇటీవల గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో వింత లోహపు బంతులు (Mysterious Metal Balls) ఆకాశ నుంచి ఊడిపడ్డాయి. అసలా బంతుల్లా ఉన్నఆ వస్తువులేంటి? ఎక్కడి నుంచి పడ్డాయో తెలియ స్థానికులు భయాందోళనక గురయ్యారు. మే 12, 13 తేదీల్లో గుజరాత్లోని (Gujarat Metal Balls) ఆనంద్ జిల్లా దగ్జిపురా, ఖంబోలాజ్, రాంపుర్‌తో పాటు ఖేడా జిల్లాలోని భుమేల్ గ్రామంలో గోళాకారంలో ఉన్న లోహపు వస్తువులు పడ్డాయి. వడోదరా జిల్లాలోని సావ్లి గ్రామంలో కూడా ఒకటి పడింది. అవి ఒకటిన్నర అడుగుల వ్యాసంతో ఉన్నాయి. బరువు 5 కిలోల వరకు ఉంటుంది. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరలేదని అధికారులు పేర్కొన్నారు. కానీ ఓ గొర్రె మరణించిందని. ఆకాశం నుంచి నేరుగా గొర్రెల మందపై పడడంతో.. అది చనిపోయింది.
ఆ గోళాకార లోహపు వస్తువుల ఫొటోలు సోషల్ మీడియాల వైరల్‌గా మారాయి. వాటిపై రకరకాల పుకార్లు జరిగాయి. ఏలియన్స్ వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అవి ఏలియన్స్ బాల్స్ అని కొందరు ప్రచారం చేశారు. విమానం కూలిపోయి ఉండొచ్చని మరికొందరు భావించారు. ఈ నేపథ్యంలో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) అధికారులు వాటిని సేకరించి పరిశీలించారు. మానవులు, జంతువులను హాని కలిగించే వస్తువులా? అని ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా పరీక్షించింది. సావ్లి గ్రామంలోలో దొరికిన వస్తువులను గాంధీనగర్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ (DFS)కి తరలించి పరీక్షలు చేస్తున్నారు.
US: గాల్లో నిలిచిన ప్రాణాలు.. 235 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్..
ఐతే అవి చైనా రాకెట్ శకలాలు కావచ్చనే అభిప్రాయాాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆకాశం నుంచి లోహపు బంతులు పడిన రోజే... హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఓ ట్వీట్ చేశాడు. చైనీస్ రాకెట్ మరోసారి భూకక్షలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవి దాని శకలాలే అయి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తయ్యాయి. ఆ తర్వాత జోనాథన్ మెక్‌డోవెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అవి చైనా రాకెట్ చాంగ్ జెంగ్ 3బీ ( Chang Zheng 3B ) శకలాలు కావొచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ZX-9Bని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ రాకెట్‌ను చైనా సెప్టెంబర్ 2021లో ప్రయోగించింది. ఐతే మే 12న అది భూ వాతావరణంలో మరోసారి ప్రవేశించిందని జోనాథన్ మెక్‌డోవెల్ చెప్పారు. ఆ రాకెట్ మే 12న గుజరాత్ మీదుగా వెళుతోందని ఆయన తెలిపారు. ఆ రోజు చైనా రాకెట్ మాత్రమే భూవాతావరణంలోకి వచ్చిందని ... అందువల్ల గుజరాత్‌లో పడిన మెటల్ బాల్స్ చైనా రాకెట్ శకలాలని తేల్చినట్లు మెక్‌డోవెల్ పేర్కొన్నారు. ఐతే 100% కన్ఫామ్‌గా చెప్పలేమని.. కానీ అవే అయి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Elephant: బెడ్ కోసం గున్న ఏనుగు హంగామా.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..
ఏప్రిల్ మొదటి వారంలో కూడా తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మెటల్ రింగ్ పడిపోయింది. ఇది చైనా రాకెట్ లాంగ్ మార్చ్ CZ-3B శకలాలు కావొచ్చని అప్పుడు కూడా ఊహాగానాలు వినిపించాయి. గుజరాత్‌లో పడిపోయిన వస్తువులు..రాకెట్లు లేదా ఉపగ్రహాలలో ఉపయోగించే హైడ్రాజైన్ ఇంధన ట్యాంకులు కావచ్చని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఐతే ఇస్రో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకలన చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.