కాశ్మీర్ లో ఒక అరాచకం తర్వాత మరో అరాచకం జరుగుతూనే ఉంది. ఆరు శతాబ్దాలుగా అక్కడ మారణహోమాలు, హత్యాకాండలు జరుగుతున్నాయి. మనం ఎన్నో చారిత్రాత్మకమైన తప్పిదాలు చేశాం. సమాజాన్ని నిలబెట్టి, మనకి విలువైన వాటిని సంరక్షించుకోడానికి ఏవైతే చేసి ఉండాలో, ఏవో కారణాల వల్ల అవి చేయలేకపోయాము. ప్రపంచం ఇంకా ఏ స్థితిలో ఉందంటే, సైనికుల్లేకుండా కేవలం పండితులతోనే మనకు విలువైన విషయాలను కాపాడుకుని అభివృద్ధి చేసుకోగల పరిస్థితి ఇంకా లేదు. భౌగోళిక పరంగా మనకు రక్షణగా ఈ పర్వతాలుండడంవల్ల, మనం ఎవరూ వచ్చి మనల్ని తాకరనే భరోసాతో జీవించాం. మన శ్రద్దని జీవితానికి సంబంధించిన సూక్ష్మ అంశాలపై పెట్టాం. కానీ ఎవరికైతే ఈ విషయాల పట్ల అవగాహన లేదో, ఎవరికైతే దుర్మార్గపు యోచనలు ఉన్నాయో, అటువంటివారు ఈ బలహీనతను పూర్తిగా వాడుకున్నారు. ఇది బారత దేశ వ్యాప్తంగా జరిగిన తప్పిదం. దాని పర్యవసానాన్ని కష్మీరీ ప్రజలు అనుభవించారు.
కధనాన్ని మార్చడం ముఖ్యం
ఆర్థికపరంగా ఏవైతే చర్యలు చేపట్టగలమో అవి చేపట్టాలి. అధిక జనాభాను తిరిగి ప్రమాదానికి గురి చేయకుండా, కనీసం కొన్ని ప్రదేశాల నైనా తిరిగి సాధించాలి. ఇది చాలా కష్టతరమైన పని. కొంత కృషి జరుగుతోంది. కానీ ఫలితాలు పెద్దగా రావడం లేదు. 370 సెక్షన్ ఆంక్షలు ఎత్తివేయడమనేది చాలా పెద్ద అడుగే, కానీ అది అక్కడ సాకారం చేసి, ఆ ప్రదేశాన్ని సాధారణ ప్రజానీకం సురక్షితంగా ఉండేలా చేయడమన్నది ఇంకా జరగలేదు. దీన్ని అదుపు చేయడం భద్రతా బలగాలకు చాలా కష్టం. ఎంతోమంది సైనికులు వారి జీవితాలనే పణంగా పెట్టారు. కానీ ఇంకా సరిపోవడం లేదు.
తిరిగి వారి ప్రాంతానికి వెళ్లడం అనేది, కాశ్మీరీ ప్రజల కల అన్న విషయం నాకు తెలుసు. కానీ ప్రతి రెండు వారాలకు, ఇద్దరు మనుషులు పోయారు, అయిదుగురు పోయారని చూస్తున్నాం. అది మనం కోరుకోవడం లేదు. అక్కడకు తిరిగి వెళ్లి, ఉన్నపలాన దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ప్రాక్టికల్ కాదు.
చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ మనకు పరిష్కారం కావాలంటే, కధనాన్ని మార్చడం చాలా ముఖ్యం. కాశ్మీర్ గురించి ఎన్నో అంతర్జాతీయ ప్రచారాలు కధనాలు ప్రచారం అవుతూ వచ్చాయి. ఎవరో ఆ కధనాన్ని అపహరించారు. మనం ఆ కధనాన్ని తిరిగి వాస్తవానికి తీసుకురావాలి. ఈ మధ్య, ఒక సినిమా తీసారు, అది కొంత చైతన్యం తీసుకువచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను కరిగించాలంటే, 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలున్న చిన్న యాడ్ ఫిల్మ్స్ అవసరం. ఇవాళ అవి ప్రతి ఒక్కరి ఫోన్లకు ఇంకా కంప్యూటార్ లకు చేరేలా చేయగల సాంకేతికత మనవద్ద ఉంది.
అలాగే కాశ్మీర్ ప్రజలకు జరిగిన విషాదాన్ని ఇంకా అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా గుర్తించాలి అని, ఆ సమాజం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు. ప్రతి ముఖ్య నగరంలోనూ - ఓ వీధి లేదా ఓ సెంటర్ను కాశ్మీర్ కు లేదా కశ్యప పర్వతానికి లేదా శిఖరానికి సంబంధించిన పేరుతో పిలవడం మొదలుపెట్టాలి. ఇవన్నీ చిన్న విషయాలే అని నాకు తెలుసు; కానీ .. మనం కాష్మీరు తాలూకూ వైభవమైన ఇంకా ఘోరమైన చరిత్రను ప్రజలకు గుర్తు చేయాలంటే, ఇలాంటి చిహ్నాలు అవసరం. ఇది ముఖ్యం - ఎందుకంటే ఆ బాధను స్వయంగా చుసిన వారు, 25 ఏళ్ళ తరవాత, ఇక ఉండరు. అది ప్రజల ఆలోచనల్లో , హృదయాల్లో సజీవంగా ఉండకపోతే, అదంతా మర్చిపోబడుతుంది.
సాంప్రదాయపరంగా బలమైన గుర్తింపును సృష్టించడం
కాశ్మీర్, ఇంకా కాశ్మీర్‌కు సంబంధించిన సందేశం, కాశ్మీర్ వైభవం, అన్నింటికీ మించి అక్కడి ప్రజలలో ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం - భవిష్యత్తుకు ఇవే ఎన్నో విధాలుగా అవసరమైన విషయాలు. నేనిది చాలా బాధతో చెబుతున్నాను - మీకున్న కొండలు లోయలు కాదు, మీకున్న జ్ఞానం అత్యంత ముఖ్యమైనది. మన భౌగోళిక గుర్తింపులను ఇంకా జాతి పరమైన గుర్తింపులను అధిగమించాల్సిన సమయం కచ్చితంగా వచ్చింది, కానీ ఈ గుర్తింపులను కోల్పోకూడదు. మన గుర్తింపుని మన సాంప్రదాయానికి, మన ఆధ్యాత్మికతకు, ఇంకా మన వద్ద ఉన్న జ్ఞానానికి మళ్ళించాల్సిన అవసరం ఉంది.
కాశ్మీర్ హిందూ యువకులందరూ ఇందులో పాల్గొనవచ్చు. మీరు దేశ వ్యాప్తంగా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా - ఒకరోజుని కాశ్మీర్ డే అని చేయండి; కాశ్మీర్ కు సంబంధించిన సాహిత్యాన్ని, కళలను, సంగీతాన్ని, ఇంకా కధనాలనూ ప్రజెంట్ చేయండి; కేవలం మీకు జరిగిన ఘోరాలను మాత్రమే కాదు, కాశ్మీర్ సంస్కృతి తాలూకు సౌందర్యాన్ని ఇంకా బలాన్ని కూడా తెలియజేయండి. ప్రజలు మిమ్మల్ని మిమ్మల్నిగా గౌరవించగలగాలి; అంతేగానీ ఎవరో మీకు ఏదో చేసిన దానికి కాదు. ఇది జరగాలి, తద్వారా యువత నిరాశతో జీవించరు, అలాగే కథనాన్ని మార్చడంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మరొక అంశం, క్యాంప్ లలోని పరిస్థితులు. ప్రభుత్వాల స్వభావం ఎటువంటిదంటే, వారికి దాన్ని మార్చాలన్న సదుద్దేశాలున్నప్పటికీ వారి యంత్రాంగం నిదానంగా పనిచేస్తుంది. అయితే క్యాంప్ పరిస్థితులను మెరుగు పరచడం మరీ పెద్ద పని కాదు. మీరు సంవత్సరానికి ఓ కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టగలిగే కార్పొరేషన్ లను గుర్తించవచ్చు. తద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పించవచ్చు. ప్రభుత్వాలు ఆ పని చేయాలని నిరంతరం ఎదురు చూసే కంటే, ఇది త్వరిత పరిష్కారం.
Covid 19 : బాబోయ్.. భారత్‌లో జోరుగా కరోనా.. ఒక్క రోజులో 1,134 కొత్త కేసులు
MLC Kavitha : ఈడీనే కవిత ప్రశ్నించారా..? అసలు లోపల ఏం జరిగిందంటే?
నా సానుభూతి తెలిపేందుకు తగిన పదాలు నా వద్ద లేవు, పోనీ తక్షణమే ఫలితాలను ఇచ్చే పరిష్కారం కూడా లేదు. నేను మీకు ఎలాంటి ఓదార్పునూ అందించలేదని నాకు తెలుసు. కానీ నా మనసంతా కాశ్మీరీ హిందు సమాజం వారి కోసం ప్రగాఢమైన సానుభూతితో తోనికిసలాడుతుంది. మనం గతాన్ని సరి చేయలేం, కానీ భవిష్యత్తు ఉండేలా చూసుకోవడం ఎలా ? మన తల్లిదండ్రులు అనుభవించిన బాధలను, కష్టాలనూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే కుదరదు; అలా కాక, మనం మన పిల్లలకోసం, ఓ సురక్షితమైన ఇంకా సాంప్రదాయపరంగా బలమైన గుర్తింపును ఏర్పరచడం ముఖ్యం.
రచయిత గురించి:
భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన యాభై మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 390 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘చైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.
(Disclaimer: ఇవి రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు. కథనంలో ఇచ్చిన ఏదైనా సమాచారం యొక్క వాస్తవికత / ఖచ్చితత్వానికి రచయిత స్వయంగా బాధ్యత వహిస్తారు. దీనికి News18తెలుగు బాధ్యత వహించదు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir