తాము శ్రీరాముడి వారసులమని మరో రాజ కుంటుంబం ప్రకటించింది. మేవార్ ఉదయ్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన మహేంద్ర సింగ్ సోమవారం ఈ ప్రకటన చేశారు. జైపూర్ బీజేపీ ఎంపీ దియా కుమారి.. తాము శ్రీరాముడి కుమారుడైన కుషుడి వారసులమని తెలిపిన మరునాడే మహేంద్ర సింగ్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయోధ్య రామ మందిర వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీం.. రాముడి వంశానికి చెందిన రఘువంశస్తులు ఇప్పటికీ ఎవరైనా అయోధ్యలో ఉన్నారా..? అని ఆరా తీయడంతో.. వీరంతా తెర పైకి వస్తున్నారు.
జైపూర్ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా తాము రాముడి కుమారుడైన కుషుడి వంశస్తులమని తెలిపారు. దానికి సంబంధించి ప్రాచీన సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు. అంతేకాదు, రాముడి మరో కుమారుడైన లవ వారసులుగా రాథోడ్స్ ప్రకటించుకున్నారని చెప్పారు. రామ మందిర విచారణలో తాను జోక్యం చేసుకోబోనని.. అయితే న్యాయస్థానం అడిగితే తమ వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Babri masjid, Supreme Court